Hey Balwanth Box Office Collections : సుహాస్ 'హే బల్‌వంత్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - చిన్న సినిమాగా వచ్చినా...
Hey Balwanth Collection Day 3 : యంగ్ హీరో సుహాస్ లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్‌వంత్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అదరగొట్టింది. వరల్డ్ వైడ్‌గా డీసెంట్ వసూళ్లు రాబట్టింది.

Suhas's Hey Balwanth World Wide Three Days Box Office Collections : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్‌వంత్' మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.
3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
'హే బల్‌వంత్'కు వీకెండ్ బాగా వర్కౌట్ అయ్యింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.5.93 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. రెండు రోజుల్లో రూ.4.16 కోట్లు కలెక్ట్ చేయగా ఒక్క ఆదివారమే రూ.1.77 కోట్లు కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్‌లోనూ వసూళ్లు స్టేబుల్‌గానే ఉన్నాయి. $201,777కు పైగా కలెక్ట్ చేసింది. ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చాయి.
View this post on Instagram
View this post on Instagram
Also Read : 'ది ప్యారడైజ్' ఆయా షేర్ ప్రోమో - హై ఎనర్జీ మాస్ బీట్‌తో జాతరే
ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేశ్, అన్నపూర్ణమ్మ, హర్షవర్థన్, యాంకర్ స్రవంతి, అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించగా... త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
తండ్రి చేసే బిజినెస్ చుట్టూనే తిరిగే కథతో సుహాస్ నవ్వులు పూయించారు. టీజర్, ట్రైలర్‌లోనూ ఇచ్చిన హైప్ మూవీలో వర్కౌట్ అయ్యింది. అసలు స్టోరీలోకి వెళ్తే... చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్) తన తండ్రి రావు బల్వంత్ (నరేశ్), నానమ్మ (అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చదువు పూర్తయ్యాక తన తండ్రి చేస్తున్న బిజినెస్‌నే టోకోవర్ చేయాలని అనుకుంటాడు. ఇందుకు ముందు నో చెప్పినా ఆ తర్వాత కొన్ని కారణాలతో నరేశ్ అంగీకరిస్తాడు. తన తండ్రి చేసే బిజినెస్ గురించి తెలుసుకున్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఆ బిజినెస్ వల్ల తన ఎంతగానో ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం) కూడా దూరం అవుతుంది. ఆమె తాత కృష్ణ బిజినెస్ చేసే చోటుకే వచ్చి చనిపోతాడు? అసలు కృష్ణ తండ్రి చేసే బిజినెస్ ఏంటి? ఎందుకు కృష్ణ తన ప్రియురాలికి దూరమయ్యాడు? చివరకు ఏం జరిగింది? రావు బల్‌వంత్ బిజినెస్‌కు చంప (యాంకర్ స్రవంతి)కి సంబంధం ఏంటి? వెన్నెల కిశోర్ రోల్ ఏంటి అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.




















