HHVM Team Clarifies About Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడిక్ అడ్వెంచరస్ 'హరిహర వీరమల్లు.' ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. పలుమార్లు వాయిదా పడుతూ రావడం.. ఈ డేట్‌లో రిలీజ్ కావడం ఖాయమంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలు రిలీజ్ డేట్‌పై రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.

టీం ఫుల్ క్లారిటీ

జులై 18న మూవీ రిలీజ్ అవుతుందంటూ సోషల్ మీడియా వేదికగా రూమర్స్ హల్చల్ చేశాయి. ఇదే తేదీ కాకుండా మరిన్ని రిలీజ్ డేట్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. వీటిపై తాజాగా మూవీ టీం స్పందించింది. అవేవీ నిజం కాదని.. రూమర్స్ నమ్మొద్దని సూచించింది. 'ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న అన్నీ రిలీజ్ డేట్స్‌ను దయచేసి పట్టించుకోవద్దు. అఫీషియల్ కొత్త రిలీజ్ డేట్‌ను తమ అధికారిక ఛానళ్ల ద్వారా కొన్ని రోజుల్లో ప్రకటిస్తాం. అప్పటివరకూ మీ లవ్, సపోర్ట్ కొనసాగించాలని కోరుతున్నాం.' అంటూ 'X'లో రాసుకొచ్చింది.

Also Read: త్రిశూలమా.. సుదర్శన చక్రమా? - బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం.. వాట్ ఏ సిగ్నేచర్ మూమెంట్!

ఫ్యాన్స్ వెయిటింగ్..

ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'భీమ్లా నాయక్' మూవీ తర్వాత పవన్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాబోతోన్న మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ అన్నీ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ట్రైలర్‌తో పాటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్.  మూవీ రిలీజ్ వాయిదా వేయాలన్న నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మూవీ రిలీజ్ డేట్స్, ఇతర అంశాలపై తప్పుడు రూమర్స్ నమ్మొద్దని.. తమ అధికారిక హ్యాండిల్స్ ద్వారా వచ్చిన వాటినే నమ్మాలని సూచించారు.

ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు నిర్మిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు. అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. పవన్ పవర్ ఫుల్ యోధుడిగా ఈ మూవీలో కనిపించబోతున్నారు. 17వ శతాబ్దపు భారీ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కు ఇక గుర్తుండిపోతాయంటూ తాజాగా.. డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పారు.