Prasanth Varma's Hanu-Man Movie paid premieres : ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాల్లో 'హనుమాన్' కూడా ఒకటి. పేరుకే చిన్న సినిమా అయినా ఆడియన్స్ లో ఈ మూవీపై హైప్ ఓ రేంజ్ లో ఉంది. హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గరనుంచే ఆడియన్స్ దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు మేకర్స్. ఆ తర్వాత టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లారు. అందుకే సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతుంటే ఆడియన్స్ దృష్టి అంతా హనుమాన్ పైనే ఉంది. 'గుంటూరు కారం' వంటి పెద్ద సినిమాతోనే పోటీ పడుతుందంటే 'హనుమాన్' కంటెంట్ విషయంలో మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
దాదాపు రూ.55 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం దేశమంతా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ హడావిడిలో ఉండడంతో తన సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసి రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే ఇండియాలో జనవరి 11న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే హనుమాన్ ప్రీమియర్స్ ని ప్రదర్శించబోతున్నారు.
ఏపీలో అమలాపురంలో ఉన్న వీపీసీ కాంప్లెక్స్ లో రాత్రి 9 గంటల షో, అలాగే వైజాగ్ జగదాంబ థియేటర్ లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్ వేనున్నారు. జగదాంబ థియేటర్ లో అయితే అరగంటలోనే టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. దాంతో మరికొన్ని థియేటర్స్ లో ఈ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్లోనూ పెయిడ్ ప్రీమియర్స్ కు సంబంధించి ఇప్పుడు చాలా షోల టికెట్స్ అమ్ముడయ్యాయి. హనుమాన్ పై ఆడియన్స్ చూపిస్తున్న ఇంట్రెస్ట్ ని బట్టి హైదరాబాద్ తో పాటూ మరిన్ని లొకేషన్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ఉండబోతున్నట్లు తెలిసింది.
ప్రీమియర్స్ కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. కాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ యూనివర్స్ నుంచి మొత్తం 12 సినిమాలు రాబోతున్నాయి. అవన్నీ ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే రూపొందనున్నాయి. ఈ యూనివర్స్ లో స్టార్ హీరోలు కూడా భాగమవుతారని ఈమధ్య డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటూ ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్జ్ జపనీస్, చైనీస్ సహా పలు విదేశీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : ప్రభాస్ 'కల్కి' విడుదలకు మెగా సెంటిమెంట్ - చిరు క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే