Killer Movie Teaser : సీరియల్స్ To సినిమా - 'కిల్లర్'లో డ్రీమ్ క్యారెక్టర్... 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ ఏం చెప్పారంటే?
Killer Teaser Review : 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేం జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కిల్లర్'. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Actress Jyothi Poorvaj About Killer Movie : సీరియల్స్‌లో రొటీన్ క్యారెక్టర్స్ చేసి విసిగిపోయిన తనకు 'కిల్లర్' మూవీలో డిఫరెంట్ రోల్స్ చేస్తానని ఊహించలేదని హీరోయిన్ జ్యోతి పూర్వజ్ అన్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'కిల్లర్' మూవీ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. లాంచ్ ఈవెంట్‌లో ఆమె తన కెరీర్, మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో జగతి పాత్రతో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్‌గా 'కిల్లర్' మూవీలో నటిస్తున్నారు.
'యాక్షన్ డ్రీమ్ రోల్'
స్క్రీన్‌పై తనను కొత్తగా చూపించేందుకు డైరెక్టర్ సుకు పూర్వజ్ ముందుకొచ్చారని అన్నారు జ్యోతి పూర్వజ్. 'ఎవరైనా డ్యూయల్ రోల్ చేస్తారు కానీ ఆరేడు క్యారెక్టర్స్‌లో పర్ఫార్మ్ చేసే అవకాశం రావడం ఏ యాక్టర్‌కైనా డ్రీమ్ అనుకోవచ్చు. విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం 'కిల్లర్' చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే నేను ఈ సినిమా చేయగలిగా. ఈ మూవీ కోసం డైరెక్టర్ చాలా కష్టపడ్డారు.
పెళ్లయ్యాక చాలా మంది పర్సనల్ వెకేషన్‌కు వెళ్తారు. కానీ మనం సినిమా చేద్దామని పూర్వాజ్ నాతో అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా రూపొందించడం ద్వారా చాలా మందికి ఎంతో కొంత ఉపాధి కల్పించిన వారం అవుతాం అనుకున్నా. పూర్వజ్‌లో అమేజింగ్ యాక్టర్ ఉన్నాడు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేసి పూర్వజ్‌ను ప్రశంసించారు. మాకున్న లిమిటేషన్స్ దాటి ఈ సినిమాను రూపొందించాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.' అని అన్నారు.
Also Read : సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్ - సమ్మర్ తర్వాత యాక్షన్ ట్రీట్
వుమెన్ సెంట్రిక్ మూవీ
ఈ మూవీ ట్రైలర్‌లో 80 పర్సెంట్ సినిమా చూపిస్తామని చెప్పారు డైరెక్టర్ సుకు పూర్వజ్. 'మీ మేథస్సును ఉపయోగించండి అనేది ఎందుకు చెప్పామో మూవీ చూస్తే తెలుస్తుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్ కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్‌తో సైఫై థ్రిల్లర్‌గా కిల్లర్ సినిమా రూపొందించాం.
కిల్లర్‌లో మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు మేము రివీల్ చేయని మరో క్యారెక్టర్ ఉంటుంది. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తాం. టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మా అందరి తరఫున థ్యాంక్స్ చెబుతున్నాం.' అని అన్నారు.
'కిల్లర్' మూవీ కోసం తామెంతో కష్టపడ్డామని... జ్యోతి పూర్వజ్‌ను సరికొత్తగా మూవీలో చూస్తారని ఇతర నటీనటులు అన్నారు. బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ మూవీలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వాజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
'కిల్లర్' నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్ - రచన, ఎడిటింగ్, దర్శకత్వం - పూర్వాజ్, సమర్పణ - ఉర్వీశ్ పూర్వజ్, ప్రొడ్యూసర్స్ - పూర్వాజ్, పద్మనాభరెడ్డి.ఎ.
డీవోపీ - జగదీశ్ బొమ్మిశెట్టి, స్క్రీన్ ప్లే ఎడిటర్ - పూర్వాజ్, మ్యూజిక్ - ఆశీర్వాద్, సుమన్ జీవ, చీఫ్ ఎడిటర్ - బి.మనోజ్ కుమార్, మాస్టర్ చీఫ్ ఎడిటర్ - శివ శర్వాణి, కాస్టూమ్ డిజైన్ - ఉదయశ్రీ పూర్వజ్, ఆర్ట్ డైరెక్షన్ - మణి, యాక్షన్ కొరియోగ్రఫీ - రాజ్ కుమార్ గంగపుత్ర, లైన్ ప్రొడ్యూసర్స్ - దశరథ మాధవ్, సీతారామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డీఎస్ బాష, డీఐ - మయసభ స్టూడియోస్, పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్).
























