అన్వేషించండి

Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

Govinda Bankrupt News: బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా దివాలా తీశారని, డబ్బుల కోసం ప్రైవేట్ ఈవెంట్లలో డాన్స్ చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. వాటిపై మేనేజర్ స్పందించారు. 

తుపాకీతో తనను స్వయంగా షూట్ చేసుకుని గాయపరచుకోవడం నుంచి భార్య సునీతతో సమస్యల వరకు... ఏడాదిగా గోవిందా పలు కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. ఆయనపై పలు వార్తలు వస్తున్నాయి. వాటిలో కొన్ని పుకార్లు కూడా ఉన్నాయి. గోవిందా ఆర్థిక పరిస్థతి బాలేదని, దివాలా తీశారని, డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్లలో డ్యాన్స్‌ చేస్తున్నారని కూడా పుకార్లు వచ్చాయి. ఇప్పుడీ పుకార్లపై గోవిందా మేనేజర్ నోరు విప్పారు. అసలు విషయం చెప్పారు.

దివాలా తీసిన గోవిందా... పుకార్లపై మేనేజర్ స్పందన
గోవిందాకు చాలా కాలంగా మేనేజర్ గా ఉన్న శశి సిన్హా సంచలన విషయాలు వెల్లడించారు. బాలీవుడ్ సీనియర్ హీరో ఆర్థిక పరిస్థితి నుంచి వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల వచ్చిన పుకార్ల వరకూ అన్నిటినీ ఖండించారు. వాటిని పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొన్నారు. చాలా సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద హిట్ లేనప్పటికీ... గోవిందాకు పరిశ్రమలోని ప్రముఖుల నుంచి సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని, త్వరలో ఒక పెద్ద సినిమాను ప్రకటించనున్నారని ఆయన తెలిపారు.

గోవిందా దివాలా తీశారన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతున్నాయి. ఆగ్రా విమానాశ్రయంలో చిన్న టాక్సీ ఎక్కినప్పటి నుంచి ఊహాగానాలు మరింత పెరిగాయి. వాటి గురించి శశి మాట్లాడుతూ... ''గోవిందాకు ఒక కారు మాత్రమే కాదు... చాలా కార్లు ఉన్నాయి. ఆయన దివాలా తీశారు, బిచ్చమెత్తుకుంటున్నారు అనేవి పూర్తిగా నిరాధారమైన విషయాలు" అన్నారు. ఆ సమయంలో విమానాశ్రయంలోకి ప్రైవేట్ వాహనాలను అనుమతించలేదని తెలిపారు.

Also Read: With Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్లలో డ్యాన్స్ చేస్తున్నారా?
ఆర్థిక ఇబ్బందుల కారణంగా గోవిందా పాఠశాలలు, ప్రైవేట్ ఈవెంట్లలో డ్యాన్స్ చేస్తున్నారన్న పుకార్లపై మేనేజర్ శశి తీవ్రంగా స్పందించారు. "అది ఆయన వృత్తి! అంటే అతను దివాలా తీశారని అర్థం కాదు" అని ANIతో అన్నారు. "ఆయన తన కుటుంబాన్ని పట్టించుకోకపోతే, ఎవరు పట్టించుకుంటారు? ఇప్పటికీ తన భార్య, పిల్లలను ఆయనే చూసుకుంటున్నారు" అని శశి స్పష్టం చేశారు.

Also ReadBarabar Premistha Controversy: బూతు పాటపై విమర్శలు... వెనక్కి తగ్గని యాటిట్యూడ్ స్టార్... అసలు ఏంటీ బరాబర్ కాంట్రవర్సీ?
Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్
Govinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

త్వరలో గోవిందా పెద్ద సినిమాను ప్రకటిస్తారు
గోవిందాకు ఇప్పటికీ డిమాండ్ ఉందని... ఈవెంట్స్, డాన్స్ పెర్ఫార్మెన్స్ లకే కాకుండా ఆయన సినిమాలకు కూడా డిమాండ్ ఉందని శశి తెలిపారు. "ఆయన కోట్ల రూపాయల ఆఫర్లను తిరస్కరించడం నేను చూశా. ఆయనకు స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు లేదా మరేదైనా కావచ్చు... పెద్ద నిర్మాతలు, నటులు వెనుక పడుతున్న మొదటి నటుడు ఆయనే. మీరు త్వరలో పెద్ద ప్రకటన వింటారు" అని శశి అన్నారు. గోవిందా హోమ్ బ్యానర్, గోవిందా ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చారు.

Also Read: Sumathi Satakam Movie Review: 'సుమతీ శతకం' సినిమాతో హీరోగా 'బిగ్ బాస్ 7' రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హిట్టు కొట్టాడా?

గోవిందాకు ఒక్కసారే ఆర్థిక ఇబ్బందులు!
గోవిందా జీవితంలో ఒక్కసారి మాత్రమే ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని, అది గోవిందా దాతృత్వం వల్ల జరిగిందని శశి వివరించారు. "ఒకప్పుడు ఆయన తన FD తీసి, దానికి కొంత డబ్బు కలిపి ఇతరులకు సహాయం చేశారు. అందుకు ఇంటిని తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ రుణం తీర్చడానికి... ఈవెంట్లలో పాల్గొని డ్యాన్స్ చేశారు. అంతే కానీ ఆయన ఎవరినీ డబ్బులు అడగలేదు" అని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget