Bhima Trailer Out: 'రామబాణం' తర్వాత మాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యునిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీలో ఎమోషన్స్‌తో పాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్‌ పవర్ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. లాంగ్‌ గ్యాప్‌ తర్వతా ఈ మాచో స్టార్ మళ్లీ‌ ఖాకీ డ్రెస్ లో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలై ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ మూవీ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇక శివరాత్రి సందర్భంగా ఈ మూవీ మార్చి 8న థియేటర్లో రిలీజ్‌ కాబోతుంది. మూవీ ప్రమోషన్స వేగవంతం చేసిన భీమా టీం తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది.


ట్రైలర్ ఎలా ఉందంటే..


గోపిచంద్‌ పవర్ఫుల్‌ లుక్‌, డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ అద్యాంతంగా ఆసక్తిగా సాగింది. ఇక మొదట్లోనే థ్రిల్లింగ్‌ అంశాన్ని చూపించి ఉత్కంఠ పెంచారు. సుమారు రెండు నిమిషాల 32 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌కు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు. అఘోరాలు, శివుడు ఆలయం వంటి సీన్స్‌ చూపించి షాకిచ్చారు. శ్రీ మహావిష్ణువుని ఆరవ అవతారం పరశురాముడు తన కండ్ర గొడ్డలితో అనంత సాగారాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నెల స్రష్టించాడు. అదే పరశురాముడి క్షేత్రమంటూ సినిమా వంటి డార్క్‌ థిమ్‌లో మైథలాజి యాంగిల్‌ చూపించి కన్‌ఫ్యూజ్‌చేశాడు. ఇక గోపీచంద్ ను పరశురాముడుతో పోలుస్తూ డైలాగ్స్ ఉన్నాయి.  ఆ తర్వాత కొందరు రాక్షసులు అహంకారంతో వీర్రవీగుతున్నప్పుడు పరశురాముడే ఓ బ్రహ్మరాక్షసుడిని పంపాడంటూ పవర్ఫుల్‌ బ్యాగ్రౌండ్‌ వాయిస్‌ వస్తుండగా పోలీసు ఆఫీసర్‌గా ఎద్దుపై హీరో ఎంట్రీ ఇస్తాడు.



ట్రైలర్‌ మొదలైన దాదాపు 20 సెకన్ల వరకు హీరో కనిపించడు. ఇక చెప్పినట్టుగానే బ్రహ్మరక్షసుడిలా గోపిచంద్‌ ఊచకోత మొదలుపెడతాడు. ఖాకీ డ్రెస్సులో విలన్లపై విరుచుకుపడటం ఇలా భారీ యాక్షన్స్‌ సీన్స్‌తో ట్రైలర్‌ను ఆసక్తిగా మలిచారు. నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊర్లో స్మశానం కూడా జరిపోదంటూ గోపిచంద్‌ చెప్పిన పవర్ఫుల్‌ డైలాగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఆ తర్వాత ఖాకీ డ్రెస్‌ వీడి మాస్‌ యాంగిల్‌ చూపించాడు. ఇక్కడ గోపించంద్‌ కొత్త గెటప్‌లో కనిపించాడు. మిల్క్‌ వైట్‌ పంచకట్టు, కాస్తా లాంగ్‌ హెయిర్‌తో మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ లో షాకిచ్చాడు. ఇలా ట్రైలర్లో మాచ్‌ స్టార్‌ రెండు వైవిధ్యమైన పాత్రల్లో గోపీచంచడం ఉత్కంఠ రేపుతుంది. మొత్తానికి భీమా మాచో స్టార్‌ మంచి కమ్‌బ్యాక్‌ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. ఇందులో అతడి పవర్ఫుల్‌, మాస్‌ లుక్‌.. ఇంటెన్సీవ్‌ యాక్షన్‌ సీన్స్‌ చూస్తుంటే సినిమా అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎమోషన్స్‌తో ఉండనుందని తెలుస్తోంది. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా..!’ అనే డైలాగ్ హైలెట్ అని చెప్పాలి.