'నారి నారి నడుమ మురారి' సక్సెస్ మీట్‌లో శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి (Sankranti 2027)కి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ సినిమా టైటిల్ ఖరారు చేశారు.

'జార్జ్ క్రిష్'గా శర్వానంద్?George Krish Movie: శ్రీను వైట్ల సినిమాల్లో క్యారెక్టరైజేషన్లు ప్రత్యేకంగా ఉంటాయి. హీరో దగ్గర నుంచి కమెడియన్స్ వరకు ప్రతి ఒక్కరి క్యారెక్టర్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. శర్వానంద్ హీరోగా చేయబోయే సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. అందుకని, స్క్రిప్ట్ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసింది. సినిమాలో హీరో పేరు కూడా అదేనని, ఆ పేరు వెనుక ఒక స్టోరీ ఉందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.

Also ReadAnantha Sriram: నేను సరస్వతి పుత్రుణ్ణి కాదు... ఆయనకు అనంత శ్రీరామ్ కౌంటర్?

ప్రస్తుతం శర్వానంద్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో నటించిన 'బైకర్' విడుదలకు రెడీ అవుతోంది. అందులో ఆయన రేసర్ రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'భోగి' చేస్తున్నారు. ప్రజెంట్ ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అది పూర్తి అయ్యేలోపు శ్రీను వైట్ల సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. 

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు 'దూకుడు', మాస్ మహారాజా రవితేజకు 'వెంకీ', మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు 'బాద్ షా', యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి 'రెడీ' వంటి హిట్ సినిమాలు అందించిన ట్రాక్ రికార్డు శ్రీను వైట్లకు ఉంది. అయితే ఈ మధ్య ఆయన చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అందువల్ల, శర్వాతో చేయబోయే సినిమాతో భారీ విజయం అందుకోవాలని ఎక్కువ కష్టపడుతున్నారని తెలిసింది.

Also ReadTrisha Vs Parthiban: తప్పు... తప్పుడు పని... త్రిషకు సారీ చెబుతూ సెటైర్ వేసిన పార్తీబన్