వంటింట్లో వాడే ముఖ్యమైన మసాలా దినుసుల్లో గసగసాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్ కి గసగసాలు ఇచ్చే అదనపు సువాసన ఎంతో ముఖ్యం. అయితే చాలామందికి తెలియదు ఇది ఒక రకమైన డ్రగ్ అని. ఇవే గసగసాలను ఓపియం అనే పేరుతో పిలుస్తారు అనీ గతంలో ఈ ఓపియం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగాయని  చరిత్ర చెబుతోంది.

Continues below advertisement

నేచురల్‌గా లభించే మత్తుమందు ఓపియంFrom Royal Kitchens to Opium Wars, The Untold Story of Gasagasalu: గసగసాలు సహజ సిద్ధంగా దొరికే 'ఓపియం పాపీ' అనే మొక్క నుండి లభిస్తాయి. ఈ మొక్కలు అరేబియన్ వర్తకుల ద్వారా వెయ్యేళ్ళ క్రితమే ఇండియాలోకి వచ్చాయి. ఈ మొక్కల నుంచి లభించే ఓపియం (నల్లమందు)ను నిజానికి మత్తు పదార్థంగానే వాడేవారు. మొఘలుల కాలంలో దీనిని ఖరీదైన వ్యాపారంగా మార్చి దీనిపై వేసే టాక్స్ లతో  తమ సామ్రాజ్యానికి రాబడి చేకూర్చుకునేవారు. మరోవైపు ఇదే మొక్క నుంచి వచ్చే గసగసాలను తమ అంతఃపురం వంటలలో చిక్కటి గ్రేవీల కోసం ఉపయోగించేవారు. బ్రిటిషర్లు వచ్చాక నల్లమందుకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని దీనిని యూరప్ కి పంపిణి చేసేవారు. అయితే చైనా ఒప్పుకోకపోవడంతో  నల్లమందు వ్యాపారం చేయడం కోసం చైనాతో రెండు యుద్ధాలు చేసింది బ్రిటిష్ రాజ్. ఆ యుద్ధాలనే ఓపియం వార్స్ అని పిలుస్తారు. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక నల్ల మందును పూర్తిగా నిషేధించారు. కేవలం ప్రభుత్వ సంరక్షణలో ఫార్మసుటికల్ అవసరాల కోసం ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓపియంను పండిస్తున్నారు. వాటి నుంచి ఆపరేషన్ సమయంలో వాడే మత్తు మందు, దగ్గు సిరప్ లాంటివి తయారు అవుతాయి. ఇదే మొక్క నుండి ఉత్పత్తి అయ్యే గసగసాలను వంట దినుసులుగా వాడుతారు. అయితే దీని పెద్ద ఎత్తున  కొనుగోలు చేయాలన్నా, అమ్మలన్నా ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి.

Also Read: Opium - ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ

Continues below advertisement

గసగసాలు, నల్లమందు... ఒక మొక్క నుంచే!రెండిటికీ మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలి?How Gasagasalu Are Made? Shocking Truth Behind This Everyday Spice: ఓపియం మొక్కలకు కాసే చిన్న చిన్న కాయలకు పచ్చిగా ఉన్నప్పుడు గంటు పెట్టి వాటి నుంచి కారే పాల నుంచి గసగసాలు తయారు చేస్తారు. కాయలు ఎండిపోయిన తర్వాత తొక్కల నుంచి ఓపియం తయారు చేస్తారు. ఓపియం అనేది పూర్తిగా ఒక మత్తుమందు. దీనిని ఇండియాలో నిషేధించారు. కానీ గసగసాలను వంట దినుసుగా వాడుతున్నారు. అయినప్పటికీ వీటిని కొద్ది మొత్తంలోనే కొనుగోలు చేయాలి. గసగసాలతో కూరలకు అదనపు రుచి మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగుపడడం, చక్కటి నిద్ర పట్టడం, ఎముకలు బలోపేతం కావడం అలాగే స్త్రీలకు సంబంధించి కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవడం లాంటి ప్రయోజనాలు గసగసాలు వల్ల.కలుగుతాయి. అలాగని వీటిని తరచుగా వాడడం వల్ల ఒక వ్యసనంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉంటారు.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ ఈ గసగసాల కోసమేనా?ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన 'డ్రాగన్' సినిమా టీజర్‌లో చూపించిన దృశ్యాల ప్రకారం... ఈ సినిమా కథాంశం మొత్తం ఓపియం చుట్టూనే నడుస్తోంది. యాక్షన్, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉండే 'డ్రాగన్' మూవీలోని మూల కథ (కోర్ పాయింట్) ఈ గసగసాల మొక్క (ఓపియం పాపీ) చుట్టూనే నడుస్తున్నట్టు కనబడడం విశేషం. మరి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇంకెంత లోతుకు వెళ్లి ఈ సబ్జెక్టు మీద ఫోకస్ చేశారో తెలియాలంటే  సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?