ఫెస్టివల్స్ టైంలో షూటింగ్స్ జరగడం అరుదు. స్టార్ హీరోస్ నుంచి ఛోటా మోటా సెలబ్రిటీల వరకు అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని చూస్తారు. ఈ వినాయక చవితికి సెలబ్రిటీలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సరదాగా కుటుంబంతో కలిసి గడిపారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోస్ ముగ్గురు మాత్రం పూజలు మిస్ అయ్యారు. వాళ్ళెవరో అర్థం అయిందిగా... సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
'పెద్ది' షూటింగులో రామ్ చరణ్ బిజీప్రేక్షకులకు, అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో మెగా ఫ్యామిలీ పూజలు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన ఉన్నారు. ఆ వీడియోలో చరణ్ లేరు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నటిస్తున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణలో రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. జానీ మాస్టర్ నేతృత్వంలో భారీ సాంగ్ షూట్ చేస్తున్నారు.
Also Read: అందాల భామల ఇంట గణేష్ చతుర్థి... పూజలు చేసిన హీరోయిన్లు... ఎవరెలాంటి డ్రస్ వేశారో చూడండి
ముంబైలో అల్లు అర్జున్? అందుకే లేరా?ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ప్రతి ఫెస్టివల్ టైంలో పిల్లలతో ఆయన కనిపిస్తారు. అయితే ఈసారి వినాయక చవితికి అల్లు వారింట జరిగిన పూజలో బన్నీ కనిపించలేదు. తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న సినిమా పనుల నిమిత్తం ఆయన ముంబైలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గణేష్ చతుర్థి పూజలు చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో అల్లు అర్జున్ సతీమణి కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటిలో బన్నీ లేరు.
Also Read: సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?