మెగా అభిమానులు అందరికీ న్యూ ఇయర్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer) ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...


డిసెంబర్ నెలాఖరున గేమ్ చేంజర్ ట్రైలర్!
రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియా స్టార్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా 'గేమ్ చేంజర్'. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూసర్లు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్ రిలీజ్ కంటే రెండు వారాల ముందు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Game Changer Trailer Release Date: డిసెంబర్ 30వ తేదీన 'గేమ్ చేంజర్' ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది.‌‌ తెలుగు రాష్ట్రాలలో ఒక భారీ ఈవెంట్ చేయడానికి యూనిట్ రెడీ అవుతుంది. అందులో ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మరి హైదరాబాద్ వేదికగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? లేదంటే ఏపీలో చేస్తారా? అనేది చూడాలి. ఢిల్లీ, చెన్నై, కొచ్చి , ముంబైలోనూ ఈవెంట్స్ చేయనున్నారు.


పాటలకు స్పందన బావుంది...
'గేమ్ చేంజర్' సినిమా నుంచి ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల అయ్యాయి. మొదట విడుదల చేసిన 'జరగండి జరగండి...', 'రా మచ్చా మచ్చా...' పాటలు మాస్ జనాల్లోకి బాగా వెళ్లాయి. ఆ రెండు డాన్స్ నెంబర్లు, మాస్ బీట్స్ కావడంతో ఫ్యాన్స్ అందరూ బీటుకు స్టెప్పులు వేశారు.


'గేమ్ చేంజర్' యూనిట్ మూడో పాటగా విడుదల చేశారని 'నానా హైరానా...' క్లాస్, మాస్ అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆల్బమ్ మొత్తానికి హైలైట్ సాంగ్ అదే అని చెప్పాలి. ఇక అమెరికాలో చేసిన ‌ ప్రీ రిలీజ్ వేడుకలో నాలుగో పాట 'డోప్' విడుదల చేశారు. దానికి మంచి స్పందన వస్తుంది. రామ్ చరణ్ సినిమాకు తమన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారని చెప్పాలి. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.


Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?






రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అంజలి మరో హీరోయిన్. ఆవిడ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో కనిపిస్తారు. దర్శకుడు నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఎస్ జె సూర్య, ‌ టాలీవుడ్ శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, మలయాళ సీనియర్ హీరో జయ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. తెలుగుతోపాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.


Also Readబరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?