Funky Trailer : విశ్వక్ సేన్ 'ఫంకీ' ట్రైలర్ వచ్చేసింది - థియేటర్లలో నవ్వుల తుపాన్ కన్ఫర్మ్
Funky Trailer Review : మాస్ కా దాస్ విశ్వక్, కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ట్రైలర్ వచ్చేసింది. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో విశ్వక్ అదరగొట్టారు.

Vishwak Sen's Funky Movie Trailer Reaction : డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేెటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ'. 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
నవ్వులు పూయించిన ట్రైలర్
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనుదీప్, విశ్వక్ కాంబో 'ఫంకీ' ట్రైలర్ నవ్వులు పూయించింది. మీ అమ్మకు ఆపరేషన్ చేయాలంటూ డాక్టర్ ఓ యువకునితో చెప్పగా... 'నాకు రాదు డాక్టర్' అంటూ సీరియస్ మూమెంట్‌లోనూ సెటైరికల్ కామెడీతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. డైరెక్టర్ కావాలనుకునే హీరో... నిర్మాతగా హీరోయిన్... వీరిద్దరి మధ్య లవ్. ఇదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కిినట్లు తెలుస్తోంది. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో విశ్వక్ అదరగొట్టారు.
ప్రతి ఫ్రేమ్‌లో వినోదం ఉట్టిపడేలా రూపొందించిన ట్రైలర్, థియేటర్లలో నవ్వుల తుపాన్ చూడబోతున్నామని కన్ఫర్మ్ అయ్యింది. విశ్వక్, కయాదు లోహర్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ట్రైలర్‌తో 'ఫంకీ'పై అంచనాలు రెట్టింపయ్యాయి.
Also Read : హీరోగా అనిల్ రావిపూడి... ప్రొడ్యూసర్‌గా అలీ అడ్వాన్... ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఫన్
ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... నరేష్, రఘుబాబు, సంపత్ రాజ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'నవ్విస్తూనే ఉంటుంది'
ఆడియన్స్‌కు ఓ మంచి సినిమా అందించాలనే ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నట్లు విశ్వక్ తెలిపారు. 'ఫంకీ సినిమా రెండు గంటల పది నిమిషాల పాటు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. ఫోన్ పెట్టుకోవాలనే ఆలోచనే రాదు. ప్రతి సీన్ చూస్తూ నవ్వుకుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్‌కి రండి. కడుపుబ్బా నవ్వుకుంటారు. ఫిబ్రవరి 13న థియేటర్లలో కలుద్దాం.' అని అన్నారు.
ట్రైలర్ చూసిన కామెడీకి వంద రెట్లు ఫన్ మూవీలో ఉంటుందని హీరోయిన్ కయాదు తెలిపారు. డైరెక్టర్ అనుదీప్ ట్రేడ్ మార్క్ మూవీలో చూస్తామని చెప్పారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ 'ఫంకీ' ఎంజాయ్ చేస్తారని అన్నారు. 'జాతి రత్నాలు'తో అనుదీప్ ఎలా మిమ్మల్ని ఆకట్టుకున్నాడో 'ఫంకీ'తోనూ అలానే ఆకట్టుకుంటాడని నిర్మాత నాగవంశీ తెలిపారు. ప్రతీ ఆడియన్‌ను 'ఫంకీ' నవ్విస్తుందన్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్‌కు స్పెషల్ అట్రాక్షన్ అని అన్నారు.
'ఫంకీ' నటీనటులు - తారాగణం: విశ్వక్ సేన్, కయాదు లోహర్, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు. దర్శకత్వం: అనుదీప్ కె.వి., నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కూర్పు: నవీన్ నూలి, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం, రచన: అనుదీప్ కె.వి, మోహన్, ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్, నిర్మాణ సంస్థలు : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
























