Funky First Day Collection: విశ్వక్ సేన్ 'ఫంకీ' బంపర్ ఓపెనింగ్ సాధిస్తుందా? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇండియా నెట్ ఎంతంటే?
Funky Box Office Collection Day 1: విశ్వక్ సేన్ హీరోగా కేవీ అనుదీప్ దర్శకత్వం వహించిన 'ఫంకీ' ఫిబ్రవరి 13న విడుదలైంది. ఈ సినిమా ఓపెనింగ్ ఎంత రావచ్చు? ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా తెలుసుకోండి.

Funky Box Office Collection Day 1 India Net: 'మెకానిక్ రాకీ', 'లైలా' ఫ్లాప్స్ తర్వాత యుంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'ఫంకీ'. 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్షన్ చేశాడు. 'అనగనగా ఒక రాజు' సక్సెస్ తర్వాత నాగవంశీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా బంపర్ ఓపెనింగ్ సాధిస్తుందా? రిలీజ్ డే (ఫిబ్రవరి 13,శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియాలో ఎంత నెట్ సాధించింది? అనేది చూస్తే...
కోటి రూపాయలకు అటు ఇటుగా...
ఇండియాలో 'ఫంకీ' కలెక్షన్స్ ఎంతంటే?
Funky First Day India Net Collection: హీరో విశ్వక్ సేన్ ముందు రెండు సినిమాలు డిజప్పాయింట్ చేసినందు వల్లనో లేదంటే మరొక కారణమో గానీ... బాక్స్ ఆఫీస్ బరిలో 'ఫంకీ'కి స్లో స్టార్ట్ లభించింది. మార్నింగ్ షోస్ అక్యుపెన్సీ 25 శాతం ఉంది.
పల్లెటూళ్లలో కంటే నగరాల్లో 'ఫంకీ'కి ఆదరణ బావుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, కాకినాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో మార్నింగ్ షోస్ 30 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు చేసింది 'ఫంకీ'. విజయవాడలో మాత్రం 15 శాతం అక్యుపెన్సీ ఉంది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి సిటీల్లోనూ 15 శాతం అక్యుపెన్సీ నమోదు చేయడం విశేషం.
View this post on Instagram
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు లెక్కలు చూస్తే... ఇండియాలో 'ఫంకీ' ఫస్ట్ డే నెట్ కలెక్షన్ రూ. 74 లక్షలు. ఓపెనింగ్ డే ఇండియాలో కోటి రూపాయలు కాస్త అటు ఇటుగా నెట్ సాధించవచ్చని అంచనా.
విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన
'ఫంకీ' చిత్రానికి విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మొదటి రోజు మూవీ బాలేదని రివ్యూస్ వచ్చాయి. దర్శకుడు అనుదీప్ రైటింగ్ స్టైల్, డైరెక్షన్ మీద ఎక్కువ విమర్శలు వచ్చాయి. మరి ప్రేక్షకుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
View this post on Instagram
'ఫంకీ' సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ నటించారు. సీనియర్ నరేష్, సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా... హరీష్ శంకర్, దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో తళుక్కుమన్నారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీత దర్శకుడు.























