Funky Box Office Collection: ఫంకీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్... ఆదివారం పడిందా? పైకి లేచిందా?
Funky Box Office Collection Day 3: బాక్సాఫీస్ బరిలో విశ్వక్ సేన్ సినిమా పరిస్థితి ఏంటి? ఆదివారం సినిమా పడిందా? పైకి లేచింది? ఫస్ట్ వీకెండ్... మూడు రోజుల్లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది?

Vishwak Sen Funky Movie Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. క్రిటిక్స్ నుంచి సినిమాకు పూర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ, మాస్ ఆడియన్స్ మాత్రం థియేటర్లకు వస్తున్నారు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఇదొక ఆప్షన్ అన్నట్టు చూస్తున్నారు. దాంతో ఫస్ట్ వీకెండ్ సినిమా కలెక్షన్స్ బావున్నాయ్. ఈ సినిమాకు మొదటి మూడు రోజుల్లో ఎంత కలెక్షన్ వచ్చింది? ఆదివారం సినిమా పడిందా? పైకి లేచిందా? అనేది తెలుసుకోండి.
ఇండియాలో ఫస్ట్ వీకెండ్ నెట్ 5 కోట్లకు ఎక్కువే
Funky India Net Collection In 3 Days: ఇండియాలో నెట్ కలెక్షన్ విషయానికి వస్తే... ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఐదు కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఓపెనింగ్ డే సినిమాకు 2.20 కోట్ల రూపాయలు వచ్చాయి. రెండో రోజు అయినటువంటి శనివారం రూ. 1.90 కోట్లు, ఇక మూడు రోజు (ఆదివారం) రూ. 1.70 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ఇండియా నెట్ 5.80 కోట్ల రూపాయలకు చేరుకుంది.
View this post on Instagram
ఫస్ట్ వీకెండ్ గ్రాస్ 10 కోట్లు దాటుతుందా?
అసలు రెండు రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత?
Funky two days worldwide collection gross: రెండు రోజుల్లో 'ఫంకీ' వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత అనేది చూస్తే... 7.5 కోట్లు కలెక్ట్ చేసింది. శుక్ర, శని వారాల్లో 'ఫంకీ' ఇండియా నెట్ కలెక్షన్ రూ. 4.1 కోట్లు. ఆ అమౌంట్ గ్రాస్ కలెక్షన్ 4.85 కోట్లు. ఓవర్సీస్ నుంచి మొదటి రెండు రోజుల్లో 2.65 కోట్ల గ్రాస్ వచ్చింది. దాంతో రెండు రోజుల గ్రాస్ రూ. 7.5 అయ్యింది. మూడు రోజు ఇండియాలో కోటిన్నరకు పైగా నెట్ వచ్చింది కనుక మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ పది కోట్లకు దగ్గర దగ్గరగా ఉండే అవకాశం ఉంది. అదీ సంగతి.
అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన 'ఫంకీ' సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ఇందులో సీనియర్ నరేష్, సంపత్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.























