Funky Box Office Collection: 'ఫంకీ' రెండో రోజు కలెక్షన్స్... నెగిటివ్ టాక్‌తోనూ స్టడీగా విశ్వక్ సేన్ సినిమా - ఇండియా నెట్ ఎంతంటే?
Funky Box Office Collection Day 2: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ డైరెక్ట్ చేసిన 'ఫంకీ' సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ లభించింది. అయినా సరే మూవీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి.

Vishwak Sen Funky Movie Collection: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఫన్ ఫిల్మ్ 'ఫంకీ'. 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్ట్ చేశాడు. మొదటి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. ఆ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ మీద అంతగా లేదని చెప్పాలి. రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే...
ఇండియాలో రెండో రోజు 'ఫంకీ' నెట్ ఎంతంటే?
Funky Movie 2nd Day Collection: మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కూడా ఇండియాలో 'ఫంకీ' మూవీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ఓపెనింగ్ డే విశ్వక్ సేన్ సినిమాకు 2.20 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ లభించింది. రెండో రోజు రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనా. అంటే కేవలం 10 పర్సెంట్ డ్రాప్ మాత్రమే ఉంది.
Also Read: Prabhas: 'కపుల్ ఫ్రెండ్లీ'కి ప్రభాస్ రివ్యూ... సంతోష్ శోభన్ రియాక్షన్ చూశారా?
View this post on Instagram
మొదటి రోజు 'ఫంకీ' వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?
Funky first day worldwide collection: వరల్డ్ వైడ్ 'ఫంకీ' ఓపెనింగ్ డే కలెక్షన్ చూస్తే... 4.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో ఫస్ట్ డే నెట్ కలెక్షన్ 2.2 కోట్లు కాగా... గ్రాస్ కలెక్షన్ 2.6 కోట్లు. ఓవర్సీస్ నుంచి 1.9 కోట్ల కలెక్షన్ వచ్చింది. దాంతో టోటల్ కలెక్షన్ రూ. 4.5 కోట్లు అయ్యింది.
Also Read: Saraswathi First Look: వరలక్ష్మి కోసం సమంత... 'సరస్వతి' ఫస్ట్ లుక్ చూశారా?
View this post on Instagram
'ఫంకీ' సినిమాలో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. సీనియర్ నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు.























