అన్వేషించండి

Friday Box Office: టాలీవుడ్‌ను డామినేట్ చేసిన తమిళ్ హిట్... ఫిబ్రవరి 6న విడుదలైన మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

With Love Movie First Day Collection: ఫిబ్రవరి 6న అరడజనుకు పైగా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో 'విత్ లవ్'కు కోటిన్నర వచ్చిందని ట్రేడ్ టాక్. మరి మిగతా సినిమాలకు ఓపెనింగ్ ఎలా ఉంది?

సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించిన 'విత్ లవ్'ను తెలుగులోనూ విడుదల చేశారు. ఆ సినిమా కాకుండా తెలుగులో అరడజనుకు పైగా  సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. నవీన్ చంద్ర 'హానీ' నుంచి గుణశేఖర్ 'యుఫోరియా' వరకు ఫిబ్రవరి 6న అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. మరి, ఏ సినిమా కలెక్షన్ ఎంత? ఏ సినిమాకు ఓపెనింగ్ బావుంది? అనేది తెలుసుకోండి.

'విత్ లవ్'... తెలుగు, తమిళ భాషల్లో కోటిన్నర!
With Love Movie Box Office Collection Day 1: 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్, 'ఛాంపియన్' హీరోయిన్ అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా 'విత్ లవ్'. ఫిబ్రవరి 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకు మొదటి రోజు ఇండియాలో కోటిన్నర నెట్ కలెక్షన్ వచ్చింది. చిన్న సినిమాకు ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

గుణశేఖర్ 'యుఫోరియా'... 'విత్ లవ్' కంటే తక్కువ!
Gunasekhar Euphoria Box Office Day 1 Collection: గుణశేఖర్ దర్శకత్వం వహించిన తాజా సినిమా 'యుఫోరియా'. 'ఒక్కడు' తర్వాత భూమిక చావ్లాతో ఆయన చేసిన చిత్రమిది. 'ధురంధర్' విజయం తర్వాత సారా అర్జున్ నటించిన సినిమా కావడంతో హిందీ ప్రేక్షకుల చూపు కూడా పడింది. ఓపెనింగ్ డే ఇండియాలో ఈ సినిమా 25 లక్షల నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. 

Barabar Premistha Movie Box Office Collection Day 1: ప్రముఖ బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, 'యాటిట్యూడ్ స్టార్' చంద్రహాస్ సినిమా 'బారాబర్ ప్రేమిస్తా'కు కాంట్రవర్సీ కలిసి వచ్చిందని చెప్పాలి. ఇండియాలో ఈ సినిమాకు 27 లక్షల నెట్ వచ్చింది. గ్రాస్ 30 లక్షల కంటే ఎక్కువ ఉందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

Naveen Chandra Honey Movie First Day Collection: నవీన్ చంద్ర హీరోగా కరుణ కుమార్ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ సినిమా 'హానీ'కి ఇండియాలో మొదటి రోజు 10 లక్షల గ్రాస్ వచ్చింది. 

Amardeep Chowdary's Sumati Satakam Box Office Collection Day 1: అమర్ దీప్ చౌదరి హీరోగా నటించిన తాజా సినిమా 'సుమతి శతకం'. ఇండియాలో ఈ సినిమాకు ఓపెనింగ్ డే 5 లక్షల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. 'శ్రీ చిదంబరం గారు' చిత్రానికి 10 లక్షల గ్రాస్ వచ్చింది. 'ఎర్ర చీర' అయితే మరీ దారుణం. ఆ చిత్రానికి కనీసం లక్ష రూపాయల నెట్ కూడా రాలేదు. 'లగ్గం' వంటి సినిమాలకు అయితే థియేటర్లకు ప్రేక్షకులు ఎవరూ రాలేదు.

Also ReadRenu Desai: ఏడేళ్ల వయసులో జరిగిన ఘటన... రేణూ దేశాయ్‌ నాన్ వెజ్ మానేయడానికి కారణం ఇదే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaali Padedhevvadu Song Lyrics: మగాడి మీద జాలిపడేదెవ్వడు... 'పురుషః'లో ఆస్కార్ విన్నర్ కీరవాణి పాడిన సాంగ్ లిరిక్స్
మగాడి మీద జాలిపడేదెవ్వడు... 'పురుషః'లో ఆస్కార్ విన్నర్ కీరవాణి పాడిన సాంగ్ లిరిక్స్
Telugu TV Movies Today: గురువారం (మార్చి 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
గురువారం (మార్చి 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
Tharun Bhascker: 'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
Israel Iran War: యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదికలో సంచలన విషయాలు
యుద్ధం మొదలైన మరుసటిరోజు అమెరికాతో చర్చలకు ఇరాన్ రెడీ? నివేదిక సంచలనం
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Finn Allen Century: 33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
33 బంతుల్లో సెంచరీతో ఫిన్ అలెన్ చరిత్ర.. 5 రికార్డులు బద్దలు కొట్టిన కివీస్ బ్యాటర్
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Embed widget