Pahlaj Nihalani: బాలీవుడ్‌లో విషాదం... సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్, నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ మృతి
Pahlaj Nihalani Passed Away: సెన్సార్ బోర్డు మాజీ చైర్మన్‌గా ప్రేక్షకులకు సుపరిచితులైన బాలీవుడ్ నిర్మాత పహ్లాజ్ నిహ్లానీ ఇకలేరు. ఆయన మృతి చెందారు.

హిందీ చిత్రసీమలో నిర్మాతగా ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) మాజీ చైర్మన్‌గా భారతీయ ప్రేక్షకులలో ఎక్కువ శాతం మందికి సుపరిచితుడలైన పహ్లాజ్ నిహ్లానీ కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన... కాలేయ సంబంధిత సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 76 ఏళ్ళు.
పహ్లాజ్ నిహ్లానీ నిర్మించిన సినిమాలు తెలుసా?
Pahlaj Nihalani Produced Movies: అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'తలాష్' సినిమా నిర్మాత పహ్లాజ్ నిహ్లానీయే. దానికి ముందు 'ఆంఖేన్', 'అందాజ్', ఆ తర్వాత 'రంగీలా రాజా', 'జూలీ 2' (Julie 2) సినిమాలను నిర్మించారు. అంతే కాదు... పలు హిట్ సినిమాల వెనుక ఆయన పాత్ర ఉంది.
సెన్సారులో వివాదాస్పదమైన పహ్లాజ్ నిర్ణయాలు
సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా పహ్లాజ్ నిహ్లానీ పాపులర్ కావడానికి కారణం... తన పదవీ కాలం (2015 నుంచి 2017)లో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే. సినిమాలపై ఆయన విధించిన సెన్సార్‌షిప్ నిబంధనలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు దారి తీశాయి.
Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
పహ్లాజ్ నిహ్లానీ కుటుంబం విషయానికి వస్తే... ఆయనకు భార్య నీతా, ముగ్గురు కుమారులు విశాల్, దీపేష్, చిరాగ్ ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















