Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎం అయ్యాక థియేటర్లలోకి వస్తున్న తొలి తమిళ సినిమా ఏదో తెలుసా? 'జన నాయగన్' కాదు... అయినా ఆయనకు స్పెషల్. ఎందుకో తెలుసా?

- సూర్య సరసన త్రిష నటించిన 'కరుప్పు' మే 14న విడుదల అవుతోంది.
Tamil Nadu CM Oath Ceremony: దళపతి విజయ్... ఇకపై కేవలం కథానాయకుడు కాదు. ఇప్పుడు ఆయన ఓ రాష్ట్రానికి సీఎం... తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10, 2026న విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు ఆయన కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్' థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ నుంచి ఇతర సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు విజయ్ సీఎం కనుక ఆయన సినిమా విడుదల అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'జన నాయకుడు' విడుదల కావడానికి సమయం పడుతుంది. మరి, విజయ్ సీఎం అయ్యాక విడుదలయ్యే తొలి తమిళ సినిమా ఏదో తెలుసా?
సీఎం కుర్చీలో విజయ్...
సినిమా హాళ్లలో త్రిషా కృష్ణన్!
First Tamil Movie Release After Vijay Became Tamil Nadu CM: సీఎం కుర్చీలో విజయ్ కూర్చున్న తర్వాత థియేటర్లలోకి వస్తున్న తొలి తమిళ సినిమా త్రిషా కృష్ణన్ (Trisha Krishnan) కావడం గమనార్హం. సీఎంగా విజయ్ బిజీ అయితే... సినిమా హాళ్లలో త్రిష సందడి చేయనున్నారు.
కోలీవుడ్ స్టార్ సూర్యకు జంటగా త్రిష నటించిన సినిమా 'కరుప్పు' (Karuppu Movie Release Date). మే 14న థియేటర్లలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అదే తేదీకి విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని 'వీరభద్రుడు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తొలుత తమిళ టైటిల్‌తో తెలుగులోనూ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో టైటిల్ మార్చారు.
View this post on Instagram
విజయ్, త్రిష మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధం గురించి తమిళనాడుతో పాటు దేశ ప్రజలు అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏకైక కథానాయిక త్రిష. అంతే కాదు... తన ఆనందాన్ని వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు విజయ్ సీఎం అయిన తర్వాత తమిళ భాషలో విడుదల అవుతున్న తొలి సినిమా త్రిషది కావడం ఆయనకు ఎంతో స్పెషల్ అని కోలీవుడ్ అంటోంది. మరి, ఈ సినిమాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయో చూడాలి. తెలుగులో ఈ సినిమాను కింగ్ అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ విడుదల చేస్తోంది.
View this post on Instagram
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















