తెలుగు హీరో, 'మా' ప్రెసిడెంట్ విష్ణు మంచు దుబాయ్‌లో ఉన్నట్టు వీడియో పోస్ట్ చేశారు. దేశానికి రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సైతం అక్కడ ఉన్నారు. యుఎస్ - ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం కారణంగా పలువురు భారతీయ ప్రజలు, ప్రముఖులు చాలా మంది దుబాయ్‌లో చిక్కుకున్నారు.  హీరోయిన్ సోనాల్ చౌహాన్ సైతం తాను దుబాయ్‌లో చిక్కుకున్నానని, ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేయాలని పోస్ట్ చేశారు. ఇప్పుడు మరొక నటి ఈషా గుప్తా కూడా తాను అబుదాబిలో ఉన్నానని చెప్పారు. ఆ మేరకు ఓ పోస్ట్ చేశారు. దాంతో ఈషా అభిమానులు ఆమె భద్రత గురించి ఆందోళన చెందారు. దాంతో తాను సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పారు. 

అబుదాబిలో ఈషా గుప్తామెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమా గుర్తు ఉందా? ఆ మూవీలో స్పెషల్ సాంగ్ 'ఏక్ బార్... ఏక్ బార్'లో స్టెప్స్ వేసినది ఈషా గుప్తా. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌లో "నా గురించి అడుగుతున్న అభిమానులకు... నాకు మెసేజ్‌లు చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి. మేం బాగానే ఉన్నాము. మేం సురక్షితంగా ఉన్నాము. అబుదాబీలో మేం సురక్షితమే. కానీ, ఈ సమయమే భయంకరంగా ఉంది. చాలా కష్టంగా గడుస్తోంది. భగవంతుడు మనల్ని రక్షించడానికి ఉన్నాడు. రక్షణ మంత్రిత్వ శాఖ మా భద్రత విషయంలో అత్యుత్తమంగా పనిచేస్తుందని మేం నమ్ముతున్నాం. త్వరలో ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

Also ReadVijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?

దుబాయ్‌లో చిక్కుకున్న సోనాల్ చౌహాన్

ఈషా గుప్తా అబుదాబి నుంచి ఆకాశాన్ని ఫోటో తీసి షేర్ చేశారు. అందులో ఆమె చేతులు జోడించిన ఎమోజీని కూడా పోస్ట్ చేశారు. అంతకు ముందు మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ సైతం దుబాయ్‌లో చిక్కుకున్నానని తెలిపారు. దుబాయ్‌లో అన్ని విమానాలు క్యాన్సిల్ చేయడంతో ఆమె పోస్ట్ చేశారు. "గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు... నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమాన సర్వీసులను రద్దు చేశారు. మన దేశానికి తిరిగి రావడానికి మార్గం కనిపించడం లేదు. నేను ప్రభుత్వ మార్గదర్శకత్వం, మద్దతు కోరుకుంటున్నా. తద్వారా నేను సురక్షితంగా ఇంటికి చేరుకోగలను" అని చెప్పారు.

Also ReadRenu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

నటి ఖుష్బూ సుందర్ ఎక్స్ వేదికగా... "మిడిల్ ఈస్ట్ దేశాలలోని భయంకరమైన పరిస్థితులను చూసి నా హృదయం బరువెక్కింది. అక్కడ అనిశ్చితి కొనసాగుతోంది. విమానాశ్రయాలు మూసివేయడం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌లలో కూడా విమానాలు నిలిపివేయబడటం వల్ల కాల్పుల్లో చిక్కుకున్న అమాయక పౌరుల గురించి ఆందోళన ఉంది" అని తెలిపారు.

Also ReadGeetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ