ఊచకోత... రికార్డుల ఊచకోత... మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (Mohanlal) రికార్డుల ఊచకోత మొదలుపెట్టారు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఓ మలయాళ సినిమా ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని, మన దేశంతో పాటు గల్ఫ్ దేశంలో భారీ వసూళ్లు రాబడుతుందని ఎవరు అనుకోలేదు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'ఎల్ 2 ఎంపురాన్' రెండు రోజుల్లో 100 కోట్ల క్లబ్బులో చేరింది.
వంద కోట్ల వసూళ్లు... అదీ 48 గంటల్లో!Empuraan collection box office: విమర్శకుల రివ్యూలు, ప్రేక్షకులలో కొందరి పెదవి విరుపులు, ఇంకా ట్రోల్స్ వంటివి పక్కన పెడితే... మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే వరల్డ్ వైడ్ 67 కోట్ల రూపాయలు వసూలు చేసింది 'ఎల్ 2 ఎంపురాన్'. రెండో రోజు కూడా బాక్సాఫీస్ బరిలో మోహన్ లాల్ దూకుడు కొనసాగింది. రెండు రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
'ఎల్ 2 ఎంపురాన్' సినిమా శుక్రవారం 100 కోట్ల క్లబ్బులో ఎంటర్ అయ్యింది. థియేటర్లలో విడుదల 48 గంటలకు కూడా కాకముందే 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఇదొక రికార్డ్. 100 కోట్లకు క్లబ్బులో చేరిన ఫాస్టెస్ట్ సినిమాగా 'లూసిఫర్ 2' రికార్డు క్రియేట్ చేసింది.
ఒక్క గల్ఫ్ దేశంలోనే మొదటి రోజు 20 కోట్లు!తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా బిగ్గెస్ట్ ఓవర్సీస్ మార్కెట్. అదే విధంగా మలయాళ సినిమాలకు అరబ్ దేశాలు బిగ్గెస్ట్ మార్కెట్. ఈ 'ఎల్ 2 ఎంపురాన్' సినిమాకు మొదటి రోజు గల్ఫ్ కలెక్షన్స్ 20 కోట్ల రూపాయల. కేరళ కంటే అక్కడ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా ఫస్ట్ డే కేరళ ఓపెనింగ్ 15 కోట్ల కంటే కాస్త ఎక్కువ వచ్చాయి.
కేరళ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో, అది బెంగళూరు సిటీలో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు కూడా మంచి నంబర్స్ నమోదు అయ్యాయి. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి 150 కోట్ల రూపాయల క్లబ్బులో 'ఎల్ 2 ఎంపురాన్' చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరో విజయం అందుకున్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసిన తర్వాత సీక్వెల్ తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు.