ఆది సాయి కుమార్ (Aadi Saikumar) లాస్ట్ ఇయర్ హిట్ ట్రాక్ ఎక్కేశారు. ఆయన కథానాయకుడిగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'శంబాల' సక్సెస్ అయ్యింది. కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ సక్సెస్ జోష్‌లో ఆయన మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

Continues below advertisement

'ఈగో రాజా'గా ఆది సాయి కుమార్!ఆది సాయి కుమార్ కథానాయకుడిగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై జి. సురేష్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. గురు శరవణన్ దర్శకుడు. ఈ చిత్రానికి 'ఈగో రాజా' టైటిల్ ఖరారు చేశారు. ఆదితో పాటుగా సతీష్‌ (Tamil Actor Sathish) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఉగాది సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఆది సాయి కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Also ReadDhurandhar 2 Review Telugu - ధురంధర్ 2 రివ్యూ: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల రివేంజ్ ఎలా ఉంది? సీక్వెల్ హిట్టేనా?

Continues below advertisement

'ఈగో రాజా'లో ఆది సాయి కుమార్‌ ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు కనిపిస్తున్నాయి. మాంచి హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా 'ఈగో రాజా'ను తెరకెక్కిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఆది కూడా చాలా డిఫరెంట్‌ & అగ్రెస్సివ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో చేతిలో సిగరెట్ పెట్టుకున్న తీరు చూస్తుంటే 'శంబాల'తో కంపేర్ చేస్తే మరొక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారని అర్థం అవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోందని, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. 

Also ReadOscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక

గతంలో కేఎస్ రవికుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో గురు శరవణన్ పని చేశారు. ఆ తర్వాత 'కూగల్ కుట్టప్ప'తో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. 'ఈగో రాజా' ఆయన మూడో సినిమా. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, సంగీతం: గిబ్రాన్, ప్రొడక్షన్ డిజైనర్: దురైరాజ్.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?