Dulquer Salmaan's Aakasamlo Oka Tara Release Date : మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా పవన్ సాదినేని దర్శకత్వం రాబోతోన్న ప్యాన్ ఇండిగా క్యూట్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకాశంలో ఒక తార'. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్, సాంగ్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది నవంబర్ 20న ఆకాశంలో ఒక తార మూవీ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. 'నక్షత్రాల వైపు ప్రయాణం ప్రారంభం. రండి రండి మీ కోసం ఓ అందమైన ప్రపంచం వేచి ఉంది.' అంటూ దుల్కర్ సల్మాన్ కూల్ లుక్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో హృదయాలను హత్తుకునేలా ఆకాశంలో ఒక తార స్టోరీ ఉండబోతుందనేది గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. సామాన్య జీవితాల్లో కనిపించే క్యూట్ లవ్ స్టోరీ, అందమైన క్షణాలను అద్భుతంగా చూపించారు.
ఈ మూవీకి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తుండగా... దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ హీరోయిన్స్‌గా నటించారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్ఫణలో లైట్ బాక్స్ మీడియా పతాకం మీద సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు. నవంబర్ 20న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Also Read : Payal Rajput : బోల్డ్ లుక్‌లో అందాల పాయల్ - బాలీవుడ్ బ్యూటీ క్యూట్ ఫోటో షూట్ చూశారా!
