Pradeep Ranganathan's Dude First Day Box Office Collections: కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'డ్యూడ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ తర్వాత ప్రదీప్ 'డ్యూడ్'తో హ్యాట్రిక్ హిట్ కొట్టారనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రికార్డు కలెక్షన్లతో ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Continues below advertisement

వరల్డ్ వైడ్‌గా...

ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 'డ్యూడ్' రూ.22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'బాక్సాఫీస్ వద్ద 'డ్యూడ్' బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.' అంటూ రాసుకొచ్చింది. ఇక వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈ కలెక్సన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Continues below advertisement

ఇండియాలో ఫస్ట్ డే

ఇక ఇండియాలోనూ ఫస్ట్ డే 'డ్యూడ్' క్రేజీ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే రూ.10 కోట్లకు నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఆరున్నర కోట్లు, తెలుగులో రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. 

Also Read: 'సు ఫ్రమ్ సో' ఫేం రాజ్ బి శెట్టి క్రేజీ ప్రాజెక్ట్ 'జుగారి క్రాస్' - టైటిల్ ప్రోమో చూశారా?

ఈ మూవీకి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా... ప్రదీప్ రంగనాథన్ సరసన 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. పశు సంవర్థక శాఖ మంత్రిగా హీరోయిన్‌కు తండ్రిగా, హీరోకు మేనమామగా నటించారు. అలాగే, రోహిణి, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.