Pradeep Ranganathan's Dude Movie 6 Days World Wide Box Office Collection: కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'డ్యూడ్' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ దీపావళికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 6 రోజుల్లోనే సెంచరీ దాటేసింది. 

Continues below advertisement

రూ.100 కోట్ల క్లబ్‌లో

తొలి 4 రోజుల్లోనే రూ.60 కోట్ల గ్రాస్ దాటేసిన 'డ్యూడ్' అందరూ ఊహించినట్లుగానే 6 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల మార్క్ దాటేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 'బాక్సాఫీస్ వద్ద 'డ్యూడ్' సెంచరీ కొట్టేసింది. వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల గ్రాస్ దాటి వసూళ్లు సాధించింది. ఈ దివాళీ సీజన్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.' అంటూ రాసుకొచ్చింది.

Continues below advertisement

హ్యాట్రిక్ హిట్

'లవ్ టుడే'తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో ప్రదీప్ తన నటనతో టాలీవుడ్ ఆడియన్స్ మనసులోనూ చెరగని ముద్ర వేశారు. 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్‌తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇవి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు తాజాగా 'డ్యూడ్' కూడా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో మూవీ టీం ఫుల్ ఖుష్ అవుతోంది.

Also Read : మూవీగా తెలుగు రొమాంటిక్ వెబ్ సిరీస్ '3 రోజెస్' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

ఈ మూవీకి కీర్తిశ్వరన్ మ్యూజిక్ అందించగా... ప్రదీప్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రోహిణి, శరత్ కుమార్, ద్రవిడ్ సెల్వం, హృదు హరూన్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.