మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) పుట్టినరోజు సందర్భంగా మే 21వ తేదీన ఆయన హీరోగా నటించిన 'దృశ్యం 3' (Drishyam 3) విడుదలైంది. కేవలం మాతృభాష మలయాళంలో కాదు... తెలుగు, తమిళ భాషల్లోనూ థియేటర్లలోకి తీసుకు వచ్చారు. 'దృశ్యం 3' రివ్యూలు చూస్తే... క్రిటిక్స్ నుంచి ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ రిపోర్ట్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. మొదటి రోజు 'దృశ్యం 3' ఎన్ని కోట్లు రాబట్టే అవకాశం ఉందంటే? 

Continues below advertisement

ప్రస్తుతానికి 10 కోట్ల లోపే కలెక్షన్లు!Drishyam 3 Box Office Collection Day 1 Prediction India Net: సినిమా కలెక్షన్స్ వెల్లడించే ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ ప్రకారం... గురువారం (మే 21) మధ్యాహ్నం మూడు గంటల వరకు, ఇండియాలో బుకింగ్స్ చూస్తే మొదటి రోజు 5.22 కోట్ల గ్రాస్ వచ్చింది. 

  • 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ 3.80 కోట్ల నెట్ రాబట్టి... మలయాళంలో మోహన్ లాల్ స్టార్ పవర్ మరోసారి చూపించింది.
  • తెలుగులోనూ మోహన్ లాల్ మార్కెట్ బావుంది. అందువల్ల, గురువారం మూడు గంటలకు 41 లక్షల నెట్ రాబట్టింది. మలయాళం తర్వాత తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
  • 'దృశ్యం 3' కన్నడ వెర్షన్ 5 లక్షల నెట్, తమిళ వెర్షన్ 16 లక్షల నెట్ రాబట్టాయి.
  • నార్త్ ఇండియా (హిందీ) బెల్ట్ కలెక్షన్స్ ఇంకా అప్డేట్ కాలేదు. 

Also Read: Venkatesh - వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

Continues below advertisement

ఓపెనింగ్ డే 30 కోట్లు దాటుతుందా?Drishyam 3 Opening Day Collection: ఇండియాలో 'దృశ్యం 3' మొదటి రోజు గ్రాస్ 10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈవెనింగ్, నైట్ షోస్ కలెక్షన్స్ యాడ్ అయితే టోటల్ పెరుగుతుంది. అయితే... మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 30 కోట్లు దాటే అవకాశం ఉందని టాక్. గల్ఫ్ దేశాల్లో మలయాళీలు ఎక్కువ. మోహన్ లాల్ సినిమాలకు అక్కడ నుంచి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి.

Also ReadDrishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల అంచనా ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే 'దృశ్యం 3' రూ. 30 నుంచి 35 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ ప్రీ సేల్స్ చూస్తే... రూ. 24 నుంచి 25 కోట్ల గ్రాస్ వచ్చిందని రమేష్ బాల చెబుతున్నారు. ఆ అమౌంట్‌లోనూ కేరళ కలెక్షన్స్ ఎక్కువ. అక్కడ రూ. 10 నుంచి 12 కోట్ల వరకు వచ్చాయట.

సమ్మర్ సీజన్‌లో తెలుగులో భారీ సినిమాలు ఏవీ రాలేదు. హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ బావుండేవి. కానీ, అలా జరగలేదు. తమిళంలో సూర్య 'కరుప్పు' ('వీరభద్రుడు') జోరు బావుంది. అక్కడ 'దృశ్యం 3' కంటే ఆ సినిమాకు ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయనేది పక్కన పెడితే... శుక్ర, శని, ఆది వారాలు మోహన్ లాల్ 'దృశ్యం 3'కి కీలకం కానున్నాయి.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?