మోహన్ లాల్ పుట్టినరోజు (Mohanlal Birthday) పుట్టినరోజు సందర్భంగా 'దృశ్యం 3' (Drishyam 3) థియేటర్లలోకి వచ్చింది. 'దృశ్యం' ఫ్రాంచైజీలో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు కలెక్షన్స్‌తో పాటు క్రిటిక్స్ అప్రిసియేషన్ సాధించాయి. దాంతో మూడో పార్ట్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు సాధించిందీ సినిమా? అనేది తెలుసుకోండి.

Continues below advertisement

ఇండియాలో మొదటి రోజు 20 కోట్లుDrishyam 3 First Day Collection India Net: ఇండియాలో 'దృశ్యం 3' మొదటి రోజు సుమారు 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో మెజారిటీ షేర్ మోహన్ లాల్ హోమ్ గ్రౌండ్ కేరళ నుంచి, ఇతర రాష్ట్రాల్లో విడుదలైన మలయాళ వెర్షన్ నుంచి వచ్చినవే. ఇండియాలో ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత నెట్ కలెక్ట్ చేసింది? టోటల్ గ్రాస్ ఎంత? అనేది సాక్‌నిల్క్ నివేదిక లెక్కల ప్రకారం చూస్తే...

  • ఇండియాలో మే 21వ తేదీన 'దృశ్యం 3' మలయాళ వెర్షన్ నెట్ కలెక్షన్లు 13.70 కోట్లు.
  • మలయాళం తర్వాత హయ్యస్ట్ కలెక్షన్స్ తెలుగు నుంచి వచ్చాయి. తెలంగాణ, ఏపీ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా నెట్ కలెక్షన్స్ కోటిన్నర.
  • 'దృశ్యం 3' తమిళ్ వెర్షన్ నెట్ కలెక్షన్లు 45 లక్షల రూపాయలు.
  • కన్నడ వెర్షన్ 'దృశ్యం 3' నెట్ కలెక్షన్ కేవలం 20 లక్షల రూపాయలు.
  • ఇండియాలో 'దృశ్యం 3' ఫస్ట్ డే టోటల్ నెట్ కలెక్షన్ 15.85 కోట్లు.
  • మొదటి రోజు ఇండియాలో 'దృశ్యం 3' గ్రాస్ కలెక్షన్ చూస్తే... 18.37 కోట్లు ఉంది. మొత్తం లెక్కలు చూస్తే... ఈ నంబర్ 20 కోట్లకు చేరుకుంటుందని టాక్.

Also ReadVenkatesh - వెంకీమామ సేఫ్... ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడు!

Continues below advertisement

ఓవర్సీస్‌లో దుమ్ము దులిపిన 'దృశ్యం 3'Drishyam 3 Collection Overseas Day 1: ఓవర్సీస్ మార్కెట్టులో 'దృశ్యం 3' దుమ్ము దులిపింది. మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. గల్ఫ్ దేశాల్లో మోహన్ లాల్ అభిమానులు ఎక్కువ. రికార్డు స్థాయిలో వాళ్ళు సినిమా చూసినట్టు టాక్. ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపితే... మొదటి రోజు 43.37 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది 'దృశ్యం 3' సినిమా. కంప్లీట్ లెక్కలు వస్తే ఈ అమౌంట్ 45 కోట్లు దాటే అవకాశం ఉంది.

Also ReadDrishyam 3 Review In Telugu - 'దృశ్యం 3' రివ్యూ: రీమేక్ కాదు... ఒరిజినల్ - మోహన్ లాల్ సినిమా ఎలా ఉందంటే?

ఫ్లాప్‌తో మలయాళంలో మోహన్ లాల్ రికార్డులుDrishyam 3 Collections Records: 'దృశ్యం 3'కు మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ, బాక్స్ ఆఫీస్ బరిలో మోహన్ లాల్ రికార్డులు క్రియేట్ చేశారు. మలయాళంలో ఓపెనింగ్ డే డబుల్ డిజిట్ క్రాస్ చేసిన సినిమాలు ప్రస్తుతానికి మూడు మాత్రమే. అందులో మొదటిది దళపతి విజయ్ 'లియో'. అది లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ ఫిల్మ్. ఇక రెండోది... మోహన్ లాల్ 'ఎల్2: ఎంపురాన్'. అది లూసిఫెర్ సీక్వెల్. మూడో సినిమా... 'దృశ్యం 3'. సినిమా బడ్జెట్ అంతా ప్రీ సేల్స్ ద్వారా వచ్చిందని మాలీవుడ్ టాక్. తెలుగులోనూ మలయాళ డబ్బింగ్ సినిమా కలెక్షన్లలో 'దృశ్యం 3'ది టాప్ ప్లేస్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also ReadNTR Networth & Cars Collection - పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?