మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ్ సినిమా 'డోరతీ' (Dorothy). ఈ శుక్రవారం (సెప్టెంబర్ 25న) రిలీజ్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) నుంచి 'ఎ' సర్టిఫికేట్ లభించింది. మూవీ ట్రైలర్ చూసిన జనాలకు అదేమీ షాకింగ్ అనిపించలేదు. వై? ఎందుకు? అంటే...

Continues below advertisement

పెద్దల సినిమా చూసే చిన్న పిల్లలు!'డోరతీ' సినిమాలో సనంత్, రిషికాంత్ హీరోలు. వాళ్ళిద్దరి చిన్నతనం నుంచి పెరిగి పెద్దయిన తర్వాత రౌడీలుగా మారే వరకు సినిమాలో చూపించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. వాళ్ళిద్దరి జీవితంలోకి ఓ అమ్మాయి (కీర్తీ సురేష్) వచ్చిన తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు - మనస్పర్థలు వచ్చాయి? అనేది స్టోరీ పాయింట్. ఈ కథను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాస్త ఘాటుగా తీశారని ట్రైలర్ బట్టి క్లారిటీ వచ్చింది. కొన్నాళ్ళ క్రితం థియేటర్లలో పెద్దల కోసం తీసిన మలయాళ సినిమాలను ప్రదర్శించేవారు. అటువంటి ఓ సినిమాకు చిన్న పిల్లలు వెళ్లినట్టు ట్రైలర్ ప్రారంభంలో చూపించారు. ఓ హీరో కళ్ళు మూసుకుంటే... మరొకరు మనం తర్వాత చేయాలి కాబట్టి చూడమని చెబుతాడు. అందువల్ల, ఈ సినిమాకు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ రావడంలో తప్పేమీ లేదని ట్రేడ్ వర్గాల్లో వినబడుతోంది.

Also Read: Dil Raju On Pawan Kalyan Vakeel Saab Remuneration - 'వకీల్ సాబ్' రెమ్యూనరేషన్‌లో ఐదు కోట్లు వదిలేశారు... దటీజ్ పవన్ కళ్యాణ్ - 'దిల్' రాజు

Continues below advertisement

సెన్సార్ బోర్డ్ నుంచి కటింగ్స్ తర్వాత వచ్చిన 'డోరతీ' ఫైనల్ కట్‌ చూస్తే... ఈ మూవీ రన్ను టైమ్ రెండు గంటల 26 నిమిషాల (146 నిమిషాలు) ఉంది. సినిమాలో చూపించిన వయలెన్స్, సమాజంలోని మానవ సంబంధాల వల్ల 'ఎ' సర్టిఫికెట్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. ఏది ఏమైనా... కీర్తీ సురేష్ సినిమా పెద్దలకు మాత్రమే. అదీ సంగతి.

Also Read: Fauzi Postponed - ప్రభాస్ 'ఫౌజీ' వాయిదా... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్ - 2027లోనే రిలీజ్

దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ 10వ సినిమా!కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పదో సినిమా 'డోరతీ'. 'పిజ్జా'తో ఆయనకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ తర్వాత 'జిగర్తాండ' చూశారు. ఆ మూవీని వరుణ్ తేజ్ హీరోగా 'గద్దలకొండ గణేష్' పేరుతో రీమేక్ చేశారు హరీష్ శంకర్. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేటా'తోనూ కార్తీక్ సుబ్బరాజ్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తీసిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. మరి ఆయనకు పదో సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

గ్రామీణ తమిళనాడు నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా 'డోరతీ' సినిమాను తెరకెక్కించారు. సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

Also Read: Naga Chaitanya Maradalu Samanta Photos - నాగచైతన్య మరదలు... మోడ్రన్ డ్రస్‌లో సమంత ధూళిపాళ ఫోటోలు