Sreeleela: ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చిందోచ్... ఇక నుంచి 'డాక్టర్' శ్రీలీల... అమ్మ చూపిన దారిలో!
Sreeleela MBBS Graduation Ceremony: శ్రీలీల హీరోయిన్ మాత్రమే కాదు... ఇక నుంచి ఆవిడ డాక్టర్ కూడా. అమ్మ చూపిన దారిలో నడుస్తూ ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు.

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను - ఇంటర్వ్యూలలో హీరోయిన్లు కొందరు చెప్పిన ఈ మాట ప్రేక్షకులకు గుర్తే. అయితే... డాక్టర్ పూర్తి చేసి కథానాయికగా మారిన అమ్మాయిలు కొందరు ఉన్నారు. అందుకు భిన్నంగా కథానాయికగా రాణిస్తూ... ఎంబీబీఎస్ పూర్తి చేసిన అందాల భామల జాబితాలో యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీ లీల చేరారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీ లీల!
Sreeleela Completed MBBS: అవును... శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తాజాగా ఆవిడ డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా ఆమె నటించిన 'గుంటూరు కారం' విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు గనుక గుర్తు ఉంటే... ఒక వైపు ఆ సినిమా షూటింగ్ చేస్తూ, మరో వైపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశానని చెప్పారు.
Actress #SreeLeela has officially graduated and completed her medical degree ❤️
— Ayyappan (@Ayyappan_1504) February 11, 2026
Balancing academics and cinema at such a young age 👏🏻👏🏻 pic.twitter.com/hGrMKv7iir
నాలుగేళ్ళ ఎంబీబీఎస్ చదివిన తర్వాత... రెండేళ్ల ఇంటర్న్షిప్ కూడా శ్రీ లీల పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం మీద ఇప్పుడు డాక్టర్ పట్టా పుచ్చుకున్నారు శ్రీ లీల. కాలేజీలో డిగ్రీ తీసుకున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అన్నట్టు శ్రీలీల తల్లి కూడా డాక్టరే. అమ్మ చూపిన బాటలో నడుస్తూ శ్రీ లీల సైతం డాక్టర్ అయ్యారు. కథానాయికగా బిజీగా ఉన్నప్పటికీ... చదువు పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎంబీబీఎస్ పాస్ అయ్యారు.
#SreeLeela has officially graduated, completing her medical degree ❤️
— Siddarth Srinivas (@sidhuwrites) February 11, 2026
Acting + academics - win win! pic.twitter.com/sisosEPRTZ
సినిమాల విషయానికి వస్తే... తమిళంలో సంక్రాంతికి విడుదలైన 'పరాశక్తి'లో శ్రీ లీల నటించారు. అందులో శివకార్తికేయన్ సరసన రత్నమాలగా కనిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె ఓ కథానాయికగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈ ఏడాది మార్చి 26న విడుదల కానుంది.
Dr.Sreeleela 👏
— Christopher Kanagaraj (@Chrissuccess) February 11, 2026
pic.twitter.com/KhrTkTcVOn



















