హీరోయిన్లలోనే అరుదైన రికార్డును దక్కించుకుంది ఓ హీరోయిన్. ఏకంగా ఒకే హీరోతో 130 సినిమాలు చేసి, అందులోనూ సగం సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. సౌత్ లో 500 కి పైగా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. అంతేకాకుండా ఓ సినిమాకు రచన, దర్శకత్వం వహించిన ఏకైక సౌత్ హీరోయిన్ గా ఆమె మరో రికార్డును క్రియేట్ చేసింది. ఈ హీరోయిన్ మరెవరో కాదు అలనాటి తార షీలా సెలిన్.
షీలా సెలిన్ నుంచి షీలా దేవిగా...షీలా సెలిన్ మలయాళీ కుటుంబంలో జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు షీలా సెలిన్. ఆమె తండ్రి రైల్వే వృత్తిలో ఉండటంతో బాల్యం అంతా ఒక్కచోట నిలకడగా గడవలేదు. చివరికి వీరి ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది. షీలా 17 సంవత్సరాల వయసులో ఎంజీఆర్ తమిళ చిత్రం 'పాసం' ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 1962లో రిలీజ్ అయిన ఈ మూవీ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆమె సహనటుడు ఎంజీ రామచంద్రన్ ఆమెను 'దేవి' అని పిలిచేవారు. దీంతో ఆమె తన పేరును 'షీలా దేవి'గా మార్చుకుంది. తమిళ సినిమాలలో చేసినన్ని రోజులు అదే పేరును పెట్టుకుంది. కానీ తరువాత ఆమె తన అసలు పేరునే తిరిగి మార్చుకుంది.
తరువాతి రెండు దశాబ్దాలు ఆమె మలయాళం, తమిళం, తెలుగు, ఉర్దూతో తో పాటు వివిధ భాషలలో 475 చిత్రాలకు పైగా నటించింది. ఒరు పెన్నింటే కదా, సర్సయ్యా, యక్షగానం, కుట్టి కుప్పాయం, చెమ్మీన్, కల్లిచెల్లమ్మా, వెలుత కత్రీనా ఆకాలే వంటివి ఆమె బ్లాక్ బస్టర్ సినిమాల లిస్ట్ లో ఉన్నాయి.
ఒకే హీరోతో 130 సినిమాలు షీలా కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి మలయాళ సూపర్ స్టార్ ప్రేమ్ నజీర్‌తో ఆమె ఐకానిక్ జోడీ. షీలా 1962లో సినీ రంగప్రవేశం చేసింది. అదే ఏడాది ఆమె ఆయన సరసన నటించింది. భారతీయ సినిమాలో అత్యంత సక్సెస్ ఫుల్ ఆన్-స్క్రీన్ జంటగా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరూ. షీలా, ప్రేమ్ ఏకంగా 130 సినిమాలలో మెయిన లీడ్స్ గా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వాటిలో దాదాపు సగం సూపర్ హిట్ సినిమాలే. ప్రేమ్ నజీర్ - షీలా అత్యధిక సినిమాలలో కలిసి నటించిన అరుదైన రికార్డును సాధించిన నటీనటులుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్నారు.
1970 - 1980లలో షీలా 'శిఖరంగల్', 'యక్షగానం' అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా రాశారు. ఆ తరువాత పలు ప్రాజెక్ట్ లు చేసిన ఆమె 1983లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి, తమిళనాడులోని ఊటకమండ్‌లో సెటిల్ అయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె 'మనసునక్కరే' అనే సినిమాతో 2003లో రీఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం తమిళ చిత్రం 'చంద్రముఖి'లో కూడా నటించింది. ఇప్పటి తరం ప్రేక్షకులను ప్రేక్షకులు ఆమెను ఈ సినిమాలో చూస్తే బాగా గుర్తుపడతారు.