అన్వేషించండి

SSMB29: మహేశ్ బాబును రిలీజ్ చేసిన రాజమౌళి - 'ఎస్ఎస్ఎంబి 29' షూటింగ్ పూర్తి కాకుండానే ఎందుకిలా.. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా?

SSMB29 : 'ఎస్ఎస్ఎంబి 29' షూటింగ్ పూర్తి కాకుండానే రాజమౌళి బోన్ నుంచి మహేష్ బాబు రిలీజ్ వెనకున్న సీక్రెట్ ఏంటో తాజాగా బయటకొచ్చింది. మహేష్ వెకేషన్ కు వెళ్ళడానికి కారణం రాజమౌళి కావడం విశేషం. అదెలాగంటే?

Rajamouli Secret Behind SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ 'SSMB29'. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉందన్న సంగతి తెలిసిందే. మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉండగానే మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లిపోయారు. సాధారణంగా తన సినిమాలను ఏళ్ల తరబడి చెక్కుతారని, మూవీ పూర్తయ్యే వరకూ నటీనటులను విడిచి పెట్టరన్న పేరుంది జక్కన్నకు. కానీ విచిత్రంగా మహేష్ మూవీ కోసం ఆయన రూల్స్ అన్నింటినీ తిరగరాస్తున్నారు. దానికి నిదర్శనమే మూవీ షూటింగ్ మధ్యలో మహేష్ ఫ్యామిలీ ట్రిప్‌నకు వెళ్లడం. తాజాగా మహేష్ ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఏంటో వెల్లడైంది. 

మహేష్ బాబు ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఇదే 
ఇటీవల మహేష్ బాబు విమానాశ్రయంలో తన పాస్‌ పోర్ట్‌‌ను ఫోటోగ్రాఫర్లకు చూపిస్తూ, తాను రాజమౌళి బోను నుంచి బయటకొచ్చానని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. అయితే జక్కన్న సినిమా అనగానే కొన్ని రూల్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా తన సినిమాలో నటిస్తున్న హీరో షూటింగ్ పూర్తయ్యేదాకా బహిరంగంగా కనిపించకూడదు. అలాగే సినిమా షూటింగ్ ఎన్నేళ్లు జరిగినా, పూర్తయ్యే వరకూ తన సినిమా మాత్రమే చేయాలి. మధ్యలో వెకేషన్లు, బ్రేకులు లాంటివేమీ ఉండవు. కానీ మహేష్ కోసం తన రూల్స్ అన్నింటినీ మార్చేస్తున్నారు రాజమౌళి. సాధారణంగా ఒక సినిమాకు 3 నుంచి 5 ఏళ్లు టైమ్ తీసుకునే జక్కన్న ఈ మూవీని మాత్రం రెండేళ్లలోనే పూర్తి చేసి, రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. 

ఇదే ఒక సంచలనం అనుకుంటే ఇప్పుడు మహేష్ మూవీ షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాకముందే వెకేషన్‌కు వెళ్లిపోయారు. మరి మహేష్ వెకేషన్ వెనుకున్న సీక్రెట్ ఏంటంటే జక్కన్నే. ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగానే, మరో మూవీ ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి జపాన్‌లో 'RRR' షూటింగ్ ఆధారంగా రూపొందించిన 'బిహైండ్ & బియాండ్' డాక్యుమెంటరీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జపనీస్ అభిమానులతో ముచ్చటించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా ఇటు జక్కన్న జపాన్‌లో బిజీ కాబట్టి, ఈ గ్యాప్‌లో మహేష్ ఓ ట్రిప్ ప్లాన్ చేశారన్నమాట. ఇక జక్కన్న కూడా మారు మాట్లాడకుండా మహేష్‌కు పాస్ పోర్ట్ ఇచ్చేసి, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. 

ఇటలీలో మహేష్ బాబు వెకేషన్ 
మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కుమార్తె సితార ఘట్టమనేనితో కలిసి ఇప్పుడు యూరోపియన్ విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. ఇటలీలోని టస్కానీలో సూపర్ స్టార్ ఫ్యామిలీ సేద తీరుతోంది. రెండ్రోజుల కిందట నమ్రతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు పంచుకున్నారు. ఇదిలా ఉండగా, రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా నటించే అవకాశం ఉంది. ఈ మూవీని 2027లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
Shekhar Kapur : కోట్లు ఖర్చు అయ్యే సీన్‌ను రూ.40లకే తీయొచ్చు! ఏఐ విప్లవంపై డైరెక్టర్ శేఖర్‌ కపూర్ సంచలన కామెంట్స్  
కోట్లు ఖర్చు అయ్యే సీన్‌ను రూ.40లకే తీయొచ్చు! ఏఐ విప్లవంపై డైరెక్టర్ శేఖర్‌ కపూర్ సంచలన కామెంట్స్  
Telugu TV Movies Today: బుధవారం (ఫిబ్రవరి 18).. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!
బుధవారం (ఫిబ్రవరి 18).. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! డోంట్ మిస్!

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
వచ్చే వారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో అకాలవర్షాలు.. పిడుగులు పడతాయని వార్నింగ్
Youtube Down: అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
అమెరికా, యూకేతో పాటు పలు దేశాల్లో యూట్యూబ్ డౌన్.. భారత్‌లోనూ యూజర్లు గగ్గోలు
Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Pakistan Vs Namibia: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. నమీబియా చేతిలో ఓడితే టోర్నీ నుంచి ఔట్
Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
Embed widget