Director YVS Chowdary About NTR Name: ద‌ర్శ‌కుడు వైవీఎస్ చౌద‌రి.. చాలా రోజుల త‌ర్వాత మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుక రానున్నారు. అది కూడా ఎన్టీఆర్ కుటుంబం నుంచి, జాన‌కీ రామ్ కొడుకుని సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఆయ‌న‌. ఇక గురువారం తెలుగు భాష దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీ రామారావు గురించి మాట్లాడిన వైవీఎస్ చౌద‌రి చాలా గొప్ప‌గా చెప్పారు. పేరు పెట్టినంత మాత్రాన ఈయ‌న ఆయ‌న అవ్వ‌లేర‌ని చెప్పారు. 


ఆయ‌న ప్లేస్ ఎవ్వ‌రూ మార్చ‌లేరు.. 


ఎన్టీఆర్ పేరుతో ఇప్ప‌టికే చాలామంది ఉన్నారు.. ఇప్పుడు వ‌చ్చే కొత్త హీరోని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అని రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కి వైవీఎస్ చౌద‌రి ఇలా చెప్పుకొచ్చారు. "నంద‌మూరి తార‌క‌రామారావు గారు. నేను ఎప్పుడు సంబోధించిన విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ భౌమ‌, న‌ట‌ర‌త్న‌, అన్న‌గారు, తెలుగు జాతి ముద్దుగా పిలిచే అన్న‌గారు, లెజెండ‌రీ అని అంటాను. ఆయ‌న‌కి రీప్లేస్ మెంట్ లేరు. ఈయ‌న‌ వేరు ఆయ‌న వేరు. ఎన్టీఆర్ పేరు నాకు ఇష్టం. నా బిడ్డ‌కి పెట్టుకుంటాను. ఆ వంశం వాళ్లు పెట్టుకోవ‌డం వ‌ల్ల ఇంటి పేరు కూడా యాడ్ అవుతుంది. రామారావు అనే పేరు చాలామంది పెట్టుకుంటారు. కానీ ఇంటిపేరు ఉన్న‌ప్పుడు ఆ పేరు మ్యాచ్ అవుతుంది. కానీ, అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచ‌నా స‌ర‌ళి, అదే గ్రాహ‌క శ‌క్తి అన్ని ఉంటేనే నంద‌మూరి తార‌క‌ రామారావు అవుతారు. ఆయ‌న‌ చ‌దివిన గ్రంథాలు, నేర్చుకున్న ప‌రిజ్ఞానం ఉంటేనే ఆయ‌నలా అవుతారు. ఆయ‌న లాగా ఎవ్వ‌రూ అవ్వ‌లేరు" అని చెప్పారు వైవీఎస్ చౌద‌రి. 


ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు.. 


"జాన‌కిరామ్ గారు ఆయ‌న కొడుక్కి తాత పేరు పెట్టారు. అలా పెట్ట‌కోవ‌డం సంప్ర‌దాయం. ఆ ప్ర‌కారం పెట్టుకున్నారు. నేను ఆ పేరును మార్చ‌లేను క‌దా? జూనియ‌ర్ ఎన్టీఆర్ అని హ‌రికృష్ణ పెట్టుకున్నారు. వాళ్ల తండ్రులు, తాత‌లు పెట్టుకున్న పేరును మ‌నం మార్చ‌లేం క‌దండి. స్క్రీన్ నేమ్ ని నేను ఎలా మారుస్తాను. ప్ర‌జ‌లు మారుస్తారు. రామారావు గారి పేరు ఎన్టీ రామారావు అని పిలుస్తారు. కొంత‌మంది ఎన్టీవోడు అని పిలుస్తారు. కొన్ని ఏరియాల్లో రామారావు అని పిలుస్తారు. వాళ్ల క‌న్వినియంట్ తో వాళ్లు పిలుస్తారు. ఉన్న‌పేరు వేయాలి క‌దా. అలా సినిమా త‌ర్వాత ప్ర‌జ‌లు, ప్రేక్ష‌కులు ఎలా పిలిస్తే ఆ పేరు వ‌స్తుంది. కాల‌మాన ప‌రిస్థితుల్లో మ‌న చేతుల్లో ఉండి కొన్ని జ‌రుగుతాయి. మ‌న చేతుల్లో లేనివి కొన్ని జ‌రుగుతాయి. వాటి గురించి మ‌నం చెప్ప‌లేం క‌దా" అని అన్నారు. 


నా మీద ఆయ‌న ప్ర‌భావం చాలా ఉంది..


"నా మీదే కాదు రామారావు అభిమానులు అంద‌రి మీద ఆయ‌న ప్ర‌భావం చాలా ఉంది. ఆయ‌న నుంచి నేర్చుకుంది అంకిత భావంతో ప‌నిచేయ‌డం. కృషి చేయ‌టం, న‌మ్మిన సిద్దాంతం కోసం మ‌డ‌మ తిప్ప‌కుండా ప‌నిచేయ‌డం, కార్య‌సిద్ధంగా ప‌నిచేయ‌డం. ఇక భాష ప‌రంగా తెలుగు భాష మాట్లాడుతుంటాం. చాలావ‌ర‌కు తెలుగులోనే మాట్లాడ‌తాను. తెలుగులోనే టైప్ చేస్తుంటాం. అలా తెలుగు భాష‌ను గౌర‌విస్తాం" అని ఆ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు వైవీఎస్ చౌద‌రి.


Also Read: నాగార్జున బర్త్‌డేకు కిక్‌ ఇచ్చే అప్‌డేట్‌ వచ్చేసింది - రజనీకాంత్‌ కూలీలో 'కింగ్‌', పాత్ర ఎంటో తెలుసా?