Director VV Vinayak: ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ వివి వినాయక్ ఈ మధ్య పెద్దగా సినిమాలు తీయడం లేదు. హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘ఛత్రపతి’ మూవీ రీమేక్ చేశారు. అయితే, ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


అందుకే సినిమాలు తగ్గాయ్:


‘‘ఒకప్పుడు  ఫ్యాక్షన్ సినిమాలు తీస్తూ టాప్ డైరెక్టర్ గా ఉండే నేను 2018 తర్వాత సడన్ గా కనిపించకపోవటానికి కారణం ప్రత్యేకంగా ఏమీ లేదు. వన్ అండ్ హాఫ్ ఇయర్  సీనయ్య సినిమాతో గడిచిపోయింది. ఆ తర్వాత హిందీలో ‘చత్రపతి’ షూటింగ్‌తో గడిచిపోయింది. కరోనా తర్వాత ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఆలోచించడం లేదు వాళ్ళ మైండ్ న్యారోగా అయిపోయింది. ఒక ‘కేజీఎఫ్’, ఒక ‘బాహుబలి’ లాంటివి కాకుండా మిగిలినవి యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో వాళ్ళు లేరు. లేదంటే చిన్న సినిమా అయినప్పటికీ కథ ఊహించనంత బలమైనదిగా ఉండాలి. అందుకే కొడితే పెద్ద హిట్ కొట్టాలి లేదంటే కామ్ గా ఊరుకోవటం బెటర్ ఉన్న పేరుని చెడగొట్టుకోవడం ఇష్టం లేదు’’ అని తెలిపారు.


రాజమౌళి చాలా రిస్క్ చేశారు


‘‘నా కోసం ప్రాణం పెట్టే హీరోలు చాలామంది ఉన్నారు. అడిగితే వెంటనే డేట్స్ కూడా ఇస్తారు. కానీ వాళ్లకి నేనంటే అభిమానం ఉంది కదా అని ఏది పడితే అది చేసేసి వాళ్లకి నా మీద ఉన్న అభిమానాన్ని చెడగొట్టుకోలేను కదా. అలాగే ఒకప్పుడు తనకు సమకాలికుడు గా ఉన్న రాజమౌళి ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండటం చాలా ఆనందంగా ఉంది. మా మధ్య ఎలాంటి ఈగోలు లేవు. ఆయన ఆ స్టేజ్ కి వెళ్లారంటే ఆయన చాలా రిస్క్ చేశారు. ‘బాహుబలి’ లాంటి ఒక సినిమా చేశారు అంటే దానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. రాజమౌళి.. తాను చేసిన రిస్క్ కి ఆయన ఇప్పుడు ప్రతిఫలం అందుకుంటున్నారు’’ అని అన్నారు.


ఎన్టీఆర్‌కు అది గాడ్ గిఫ్ట్


‘‘ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడు. రిహార్స్ ల్స్ చేయటం లాంటివి అతను చెయ్యడు. కాన్ఫిడెంట్‌గా కెమెరా ముందుకి వస్తాడు.. యాక్ట్ చేస్తాడు.. వెళ్ళిపోతాడు. అంతే అది ఆయనకి ఒక గాడ్ గిఫ్ట్. ఆయన పాన్ ఇండియా స్టార్ అవ్వటంలో నాకైతే ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆయనకి ఆ అర్హత ఉంది’’ అని తెలిపారు వినాయక్.


Also Read: 'యానిమల్' క్లైమాక్స్ ఫైట్ కూడా కాపీయేనా? - వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో, ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!