(Source: ECI | ABP NEWS)
Mutton Soup Trailer: 'మటన్ సూప్' తినకుంటే కొడుకు కాదా! - డిఫరెంట్‌గా ట్రైలర్... ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవే
Mutton Soup: లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మటన్ సూప్' ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ వశిష్ట రిలీజ్ చేశారు. ఈ నెల 10న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mutton Soup Trailer Released: యంగ్ హీరో రమణ్, వర్షా విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మటన్ సూప్'. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ ఆకట్టుకుంటుండగా... తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ డైరెక్టర్ వశిష్ట ట్రైలర్ రిలీజ్ చేయగా... సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.
రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా 'మటన్ సూప్' మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ రామచంద్రకు ఇది ఫస్ట్ మూవీ కాగా... రమణ్, వర్షాతో పాటు జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాల బ్యానర్లపై మల్లికార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించారు.
Also Read: 'ఉపేంద్ర' మూవీ రీ రిలీజ్ - 26 ఏళ్ల తర్వాత మళ్లీ కల్ట్ క్లాసిక్ చూసేందుకు రెడీయేనా...
టీంకు ఆల్ ది బెస్ట్
డైరెక్టర్ వశిష్ట మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్, ట్రైలర్ ఎంత బాగున్నాయో సినిమా కూడా అంతే సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టైటిల్ చాలా బాగుందని... స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు.
ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలు, మూవీ టీంకు డైరెక్టర్ రామచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. 'మా కోసం వచ్చిన డైరెక్టర్ వశిష్ట గారికి థాంక్స్. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి సినిమా కోసం పని చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్ 10న మా సినిమాను చూడండి. చూసిన ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది.' అని అన్నారు. 'మటన్ సూప్'ను రామచంద్ర అద్భుతంగా తీశారని హీరో రమణ్ అన్నారు. తమ సినిమాను అందరూ తప్పకుండా చూడాలని ఆకాంక్షించారు.
అడ్డంకులు అధిగమించి
'మటన్ సూప్' సినిమాకు టీం ఎంతో సహకరించిందని నిర్మాత మల్లిఖార్జున ఎలికా తెలిపారు. 'జెమినీ సురేష్ మాకు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. మూవీలో ఆయన నటన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. వెంకీ వీణా ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం. ఈ టైటిల్ వద్దని మొదట్లో చెప్పాను. కానీ కథ విన్న తరువాత ఆ టైటిల్ అయితేనే పర్పెక్ట్ అని తెలిసింది. సెన్సార్ నుంచి కూడా మాకు సమస్యలు వచ్చాయి. అన్ని అడ్డంకులు దాటుకుని అక్టోబర్ 10న మా చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రామచంద్ర ఈ సినిమాను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. మా అమ్మ గారి కలను ఆడియెన్స్ ముందుకు తీసుకువస్తున్నాం. మా మూవీని ఆడియెన్స్ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మా కోసం ఈవెంట్‌కి వచ్చిన వశిష్ట గారికి థాంక్స్.' అని అన్నారు.
మూవీలో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని నటుడు జెమినీ సురేష్ అన్నారు. చిన్న చిత్రాలను ఆడియన్స్ ఆదరిస్తే మరికొంతమంది ఇండస్ట్రీలోకి వస్తారన్నారు. 'మటన్ సూప్'లో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నటుడు శ్రీచరణ్ థాంక్స్ చెప్పారు. మూవీ అందరూ తప్పకుండా చూడాలన్నారు.




















