Director Vasshishta About Vishwambhara Movie Story: మెగాస్టార్ చిరంజీవి అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే స్టోరీ ఏంటి అనే దానిపై సోషల్ మీడియాలో రూమర్స్ హల్చల్ చేశాయి. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ట.
యమలోక To బ్రహ్మలోకం
మనం దేవలోకాలకు సంబంధించిన మూవీస్ చాలా చూశామని... వాటన్నింటినీ దాటి ఓ లోకాన్ని ఈ మూవీలో చూపించామని వశిష్ట తెలిపారు. 'మనకు పైన 7 కింద 7 మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఇప్పటివరకూ వచ్చిన మూవీస్‌లో ఈ 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వారు చూపించారు. యమలోకం, పాతాళ లోకం, స్వర్గలోకం ఇలా అన్నీ లోకాలను మనం చూశాం. 'విశ్వంభర' మూవీలో వాటన్నింటినీ దాటి వెళ్లాను. బ్రహ్మదేవుడు కొలువై ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించా. ఈ 14 లోకాలకు అదే మూలం.
హీరో డైరెక్ట్‌గా ఆ లోకానికి ఎందుకు వెళ్లాడు? అసలు హీరోయిన్‌ను ఎలా తెచ్చుకుంటాడు? హీరోయిన్ ఆ లోకంలో ఉండడానికి గల కారణం ఏంటి?' అనేదే మా సినిమా అని చెప్పారు వశిష్ట. ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా... మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దైవ లోకాలను రియాలిటీలో చూపించేందుకు భారీ సెట్స్ వేశామని గత ఇంటర్వ్యూల్లో చెప్పారు.
మెగాస్టార్ డిఫరెంట్ రోల్
ఇప్పటివరకూ ఎవరూ చూడని రోల్‌లో మెగాస్టార్ చిరంజీవిని చూస్తారని వశిష్ట అన్నారు. 'వీఎఫ్ఎక్స్ సాయంతో సరికొత్త ప్రపంచాన్ని సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించాం. ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ కంపెనీలు దీని కోసం పని చేస్తున్నాయి. ఆడియన్స్‌కు ఓ విజువల్ వండర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం.' అని తెలిపారు.
ఆ సాంగ్ రీమేక్?
మెగాస్టార్ 'ఖైదీ' సినిమాలో 'రగులుతోంది మొగలిపొద...' సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సాంగ్‌ను 'విశ్వంభర'లో రీమేక్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ వైరల్ అవుతుండగా... మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరంజీవి అంటేనే డ్యాన్స్... జోష్... ఓ గ్రేస్. అందుకు తగ్గట్టుగానే ఈ సాంగ్ రీమేక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ భామ మౌనీరాయ్ ఈ పాటలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ బ్యూటీ 'నాగిని' సీరియల్‌తో పాటు పలు టీవీ సీరియల్స్, రియాలిటీ షోల ద్వారా పాపులర్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.