Tharun Bhascker's Ee Nagaraniki Emaindi Sequel Release Date : చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 2018లో రిలీజై యూత్‌కు హార్ట్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుండగా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌పై డైరెక్టర్ కీలక అప్డేట్ ఇచ్చారు.

Continues below advertisement

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ ఏడాది చివర్లో మూవీ రిలీజ్ ఉంటుందని చెప్పారు తరుణ్ భాస్కర్. అక్టోబరులో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. నలుగురు మధ్య తరగతి యువకుల జీవితంలో జరిగిన సంఘటనలు 'ఈ నగరానికి ఏమైంది'లో చూపించారు. వేర్వేరు లక్ష్యాలున్న నలుగురు యువకులు ఓ పార్టీలో ఫుల్‌గా తాగేసి అనుకోని పరిస్థితుల్లో గోవా వెళ్తారు. అక్కడ వారికి ఎదురైన అనుభవాలు, ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'ENE REPEAT' రూపొందుతోంది.

Continues below advertisement

ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, వెంకటేస్ కాకుమాను, అభినవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో సుశాంత్ రెడ్డి కార్తీక్ పాత్రలో నటించగా అనుకోని కారణాలతో ఆయన ప్లేస్‌లో శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కాగా... సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.

Also Read : బన్నీ, అట్లీ మూవీలో సాంగ్స్ ఎన్నో తెలుసా? - యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆన్ వర్క్స్