Director Sukumar Comments on Pushpa 2: టాలీవుడ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ పాన్‌ ఇండియా సినిమాల్లో 'పుష్ప: ది రూల్‌' ఒకటి. క్రియేటివ్  డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ మూవీపై విపరీతమైన బజ్‌ క్రియేట్‌. 'పుష్ప 1' కల్ట్‌ బ్లాక్‌బాస్టర్‌తో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పార్ట్‌ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది..  ఇంకా మూవీని రిలీజ్‌ చేయకపోవడంపై ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. దానికి  తోడు మూవీ షూటింగ్‌ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్‌డేట్స్‌ కూడా పెద్దగా రావడం లేదు. అప్పుడెప్పుడో ఫస్ట్‌ గ్లింప్స్‌ వదిలి ఫ్యాన్స్‌ని ఖుష్ చేశాడు డైరెక్టర్.


ఆ వీడియోలో పరారిలో పుష్పరాజు అంటూ చూపించి మూవీ లవర్స్‌లో క్యూరియసిటీ పెంచాడు. ఆ హడావుడి చూసి 2023లోనే మూవీ థియేటర్లోకి వస్తుందనుకున్నారు. కానీ దాన్ని కాస్తా ఈ ఏడాది ఆగష్టుకు తీసుకువచ్చాడు సుకుమార్‌. రిలీజ్‌ డేట్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా.. కనీసం అప్‌డేట్స్‌ అయినా ఇస్తున్నారా? అంటే అదీ లేదు. దీంతో మూవీ లవర్స్‌ 'పుష్ఫ 2' అప్‌డేట్స్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న క్రమంలో ఏకంగా డైరెక్టర్‌ సుకుమారే సాలీడ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో 'పుష్ప 2' విశేషాలను పంచుకున్నాడు. 


ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేస్తున్నా.. 


ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడుతూ.. "ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేస్తున్నా. 'పుష్ప' కంటే ‘పుష్ప 2’ అంతకుమించి ఉంటుంది. పార్ట్‌ 2 సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా వచ్చింది. ‘భైరోసింగ్ షెకావత్, పుష్పల మధ్య జరిగే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయి. అలాగే పుష్పరాజ్‌కు ఎదురయ్యే సమస్యలు.. దాన్ని అతను ఎదుర్కొన్న తీరు అద్భుతంగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘పుష్ప 2’ సినిమాటోగ్రఫీపై తనకు చాలా నమ్మకం ఉందని, ఖచ్చితంగా పార్ట్‌ 2 ప్రేక్షకుల అంచాలను మించి ఉంటుందని చెప్పాడు.  సుకుమార్ కామెంట్స్ తో మూవీపై అంచనాలు నెక్ట్స్ లెవల్ కు చేరుకున్నాయి. కాగా 'పుష్ప: ది రైజ్‌'లో చివరిలో విలన్‌ను చూపించి పార్ట్‌ 2పై బజ్‌ పెంచాడు సుకుమార్‌.


Also Read: బాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌తో చరణ్‌ పాన్‌ ఇండియా మూవీ! - కథ ఏంటో తెలుసా?


ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే పుష్ఫకు ఫారెస్ట్ ఆఫీసర్ బైరోసింగ్ షెకావత్‌ ద్వారా ఎలాంటి సవాళ్లు ఎదురవబోతున్నాయో.. పార్ట్‌ వన్‌లో శాంపుల్‌ చూపించి ఆ ఇద్దరి మధ్య ఘోరమైన  యుద్ధం మొదలవుతుందని చూపించాడు. మరోవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌లో ప్రధాన సభ్యుడిగా ఉన్న పుష్ప పై అదే సిండికేట్‌కు చెందిన పలువురు దాడి చేయడం.. కొందరు రాజకీయ శత్రువులు కూడా  క్రియేట్ అవ్వడం. వారందరితో పుష్పరాజ్‌ ఎలా పోరాడాడు.. అందరినీ ఎలా ఓడించాడు అనే కథాంశంతో 'పుష్ప 2' ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. కాగా ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌ కాగా.. ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ రావు రమేష్, సునీల్ తదితరులు ‘పుష్ప 2’ సినిమాలోనూ కనిపించనున్నారు. ఆగష్టు 15న 'పుష్ప: ది రూల్‌' వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.