Dhanush Almost Finalized In The Lead Role For Shankar Velpari Movie : 'గేమ్ ఛేంజర్', 'భారతీయుడు 2' మూవీ డిజాస్టర్స్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ కాస్త గ్యాప్ తీసుకుని భారీ ప్రాజెక్ట్ 'వేల్పారి' కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.1000 - రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
ధనుష్ ఫైనల్!
ఈ మూవీని ఎస్ యు వెంకటేశన్ రాసిన 'వీర యుగ నాయకన్ వేల్పారి' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వేల్పారి వీరత్వం, చోళ, పాండ్య రాజులతో ఆయన చేసిన పోరాటాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది. మల్టీ స్టారర్‌గా మూవీ తెరకెక్కుతుండగా... కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో పాటు మరో హీరోను కూడా శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ధనుష్ దాదాపు ఫైనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
రెండేళ్ల డేట్స్... ధనుష్ డెసిషన్ ఏంటి?
అయితే, ఈ మూవీ కోసం ధనుష్ దాదాపు రెండేళ్లు డేట్స్ శంకర్ అడిగినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి దీనిపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ధనుష్ అంత రిస్క్ చేస్తారా? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీని తర్వాత 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో 'D55' మూవీ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా చేయనున్నారు. అలాగే, 'లబ్బర్ పండు' మూవీ ఫేం డైరెక్టర్ తమిళరసన్ దర్శకత్వంలో 'D56' మూవీ తెరకెక్కనుంది. ఇందులో ధనుష్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికయ్యారనే ప్రచారం సాగుతోంది. మరి ఇన్ని ప్రాజెక్టుల మధ్య శంకర్ మూవీ కోసం రెండేళ్లు డేట్స్ ఇస్తారో లేదో అనేది సస్పెన్స్ నెలకొంది.
'ఛావా' ఫేం...
'వేల్పారి'లో మరో హీరో రోల్ కోసం బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో శంకర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అంతకు ముందు ఈ రోల్ రణవీర్ సింగ్ చేస్తారనే ప్రచారం సాగింది. ఇప్పుడు విక్కీని సంప్రదిస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
అవతార్, గేమ్ ఆఫ్ త్రోన్స్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో VFX, గ్రాఫిక్స్‌తో ఈ మూవీ రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు శంకర్. ప్రపంచమంతా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటుందని... అది తన కల అంటూ శంకర్ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా చెప్పారు. ఈ మూవీని నిర్మించేందుకు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా... ఈ ఏడాది మధ్యలో మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
