Varalaxmi Sarathkumar : రామ్ చరణే వచ్చారు... మీరెందుకు రారు? - అడుక్కున్నా కానీ... వరలక్ష్మిపై డైరెక్టర్ తీవ్ర ఆగ్రహం
Police Complaint : హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్‌పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్స్‌కు రాలేదంటూ మండిపడ్డారు.

Director Saneev Comments On Varalaxmi Sarathkumar In Police Complaint Promotions : వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'పోలీస్ కంప్లైంట్'. జూన్ 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సంజీవ్ మెగోటి హీరోయిన్ వరలక్ష్మిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఆమెను అడుక్కున్నా...
వరలక్ష్మి శరత్ కుమార్‌పై డైరెక్టర్ సంజీవ్ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని కూడా ప్రమోషన్స్‌కు రాలేదని అన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం డబ్బింగ్ మూడు నెలలు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. 'ఇది నాకు 11వ సినిమా. కథను నమ్మి సినిమా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. 52 మంది సీనియర్ నటులతో కేవలం 45 రోజుల్లో మూవీని కంప్లీట్ చేశాం. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' చుట్టూ స్టోరీ సాగుతుంది.
మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్‌ది ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర. ఆమె సౌకర్యం కోసం మేము అన్ని విధాలా సహకరించాం. కానీ డబ్బింగ్‌కు కూడా సరిగ్గా అందుబాటులోకి లేకుండా మాకు ఇబ్బందులు కలిగించారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ రియాక్ట్ కాలేదు. ప్రెస్‌మీట్‌కు రమ్మని అడుక్కున్నా. షూటింగ్ టైంలో ఆమె చేతికి గాయమైనా మేమే కాంప్రమైజ్ అయ్యాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఇలా వ్యవహరించడం బాధాకరం. దీని వల్ల మా చిత్రానికి భారీ నష్టం జరిగింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.' అని అన్నారు.
Also Read : NBK111 Story : NBK111 స్టోరీ ఏంటి? - స్టైలిష్ గాడ్ గ్లింప్స్... జెన్‌జీ ట్రెండ్‌లో బాలయ్య లుక్
'రామ్ చరణే వచ్చారు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోనే పెద్ది మూవీ కోసం ఎక్కువగా ప్రమోషన్స్ చేశారని తెలిపారు డైరెక్టర్ సంజీవ్. 'దేశవ్యాప్తంగా అన్నీ ప్రమోషనల్ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. మీడియా ముందుకొచ్చి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. వాళ్లు చాలా గ్రేట్. రీసెంట్‌గా డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చారు. మీరెందుకు రారు మేడమ్?' అంటూ ఆయన వరలక్ష్మిని ప్రశ్నించారు.
పోలీస్ కంప్లైంట్ నటీనటులు - వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతివర్మ, శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, ప్రీతి సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు.
టెక్నికల్ టీం - నిర్మాత : బాలకృష్ణ మహారాణా, బ్యానర్ : ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్, దర్శకత్వం : సంజీవ్ మేగోటి, DOP : ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప, ఎడిటింగ్ : అనుగోజు రేణుకా బాబు, మ్యూజిక్ : ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో, సాహిత్యం : సాగర్ నారాయణ, సంజీవ్, చింతల ప్రసన్న రాములు, సుధాకర్ మారియో, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, రవితేజ, కొరియోగ్రఫీ : పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా, ఆర్ట్ డైరెక్టర్ : కె.వి. రమణ, ప్రొడక్షన్ డిజైనర్ : కొండపనేని మురళీధర్, మేకప్ : విజయ్ – శేఖర్, కాస్ట్యూమ్స్ : నల్లపు సతీష్
సౌండ్ డిజైన్ & ఆడియోగ్రఫీ: దొంతం ప్రవీణ్ రెడ్డి, వీఎఫ్‌ఎక్స్: మ్యాజిక్ లూమ్ విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్.
Also Read : Balakrishna Birthday Celebrations: బాలకృష్ణ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నారా లోకేష్... ఫోటోలు చూశారా?
ట్రెండింగ్ వార్తలు























