Puri Jagannadh Mother Passed Away : టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నానమ్మ తమకు దూరమైనట్లు పూరి కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. శనివారం తన నానమ్మ చనిపోయినట్లు ఇన్ స్టా స్టోరీలో ఆమెతో ఉన్న ఫోటోస్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
'ఐ మిస్ యూ నానమ్మ'
ఐ మిస్ యూ నానమ్మ అంటూ ఎమోషనల్ అయ్యారు పవిత్ర. 'ఇప్పుడు నన్నెవరు చిట్టితల్లి అని పిలుస్తారు? నన్నెవరు ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు? నీతో మరో రోజు గడిపే ఛాన్స్ వస్తే బాగుండు? నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ.' అంటూ రాసుకొచ్చారు. దీంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read : Ram Charan : రామ్ చరణ్‌కు సర్జరీ - 'పెద్ది' గాయానికి ఇప్పుడు శస్త్రచికిత్స... ఎప్పుడు, ఎక్కడంటే?
ఇక సినిమాల విషయానికొస్తే... చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నారు. 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే మూవీ తీస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు. కొత్త మూవీతో ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
Also Read : Mahesh Babu: అన్నయ్య కొడుక్కి మహేష్ సపోర్ట్ లేదా? క్లారిటీ ఇచ్చిన అజయ్ భూపతి
