Director Mohan Reaction About Singer Chinmayi Song Controversy In Draupadi Movie : 'ద్రౌపది' మూవీలో 'ఎమ్కోనీ' (నెలరాజె) సాంగ్ పాడినందుకు సింగర్ చిన్మయి ఆడియన్స్‌కు ముందుగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి మోహన్ జి దర్శకత్వం వహించగా... ఆయన సినిమా అని తెలిసుంటే తాను ఈ పాట పాడేదాన్ని కాదని తెలిపారు. దీనిపై డైరెక్టర్ మోహన్ రియాక్ట్ అయ్యారు.
'ట్వీట్ డిలీట్ చేయండి'
సాంగ్ రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి తెలిసుంటే ఈ ప్రాజెక్టులో భాగం అయ్యుండేదాన్ని కాదని చిన్మయి చెప్పారు. దీనిపై స్పందించిన మోహన్... 'ఎంకోనే పాట పాడేందుకు చిన్మయి అయితే బాగుంటుందని ఆమెతో పాట పాడించాను. రికార్డింగ్ టైంలో జిబ్రాన్ అందుబాటులో లేకపోవడంతో నేను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించాను. సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. నాతో కానీ మ్యూజిక్ డైరెక్టర్‌తో కానీ మాట్లాడకుండా ఎలాంటి వివరణ తీసుకోకుండానే ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై చిన్మయి వివరణ ఇవ్వాలి. లేదా ఆ ట్వీట్ డిలీట్ చేయాలి.' అని కోరారు.
ఆ సాంగ్ బ్యాగ్రౌండ్ ఏంటంటే?
అసలు 'ఎంకోనే' పాట ఏం సందర్భంలో వస్తుందో మోహన్ వివరించారు. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జరుగుతుంది. అందులో హోయసాల రాజ్యానికి చెందిన మహారాజు వీర వల్లా (మూడో వీర వల్లాలర్)... కడవరాయన్‌కు పట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. ఈ దంపతుడు పేరెంట్స్ అయ్యే సందర్భంలో జరిగే సీమంతం వేడుకలో వీర వల్లా మహారాజు కడవరాయన్‌కు ఓ బహుమతి ఇస్తారు. ఈ సందర్భంలో వచ్చే పాటనే 'ఎంకోనే' అని చెప్పారు డైరెక్టర్.
Also Read : నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
అసలెందుకిలా?
ఈ పాట పాడినందుకు సింగర్ చిన్మయి ముందుగానే సారీ చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మోహన్ ఎక్కువగా యాంటి దళిత్ మూవీస్ తీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందుకే ఆమె సారీ చెప్పారంటూ నెటిజన్లు చెపుతుండగా... అసలు ఏమీ లేకుండానే ముందుగా సారీ చెప్పడం ఏంటంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అంతకు ముందు సింగర్ చిన్మయి చేసిన ట్వీట్‌కు రియాక్ట్ అయిన మోహన్... 'నా సినిమాలో యాక్టర్స్, టెక్నికల్ టీం లేదా ద్రౌపది 2లో నాతో పని చేసే వారిని టార్గెట్ చెయ్యొద్దు. నా సినిమా ఏది మాట్లాడినా అది నా సొంత సృష్టి. భావజాలం. మీ టార్గెట్ నేనే. నాతో, నా ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారిని టార్గెట్ చెయ్యొద్దు. అలా చేయడం ఏ రకమైన పిరికితనం.' అంటూ చెప్పారు. నిజానికి 'ద్రౌపది 2' మూవీని నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మోహన్ జి దర్శకత్వం వహిస్తుండగా... ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.