Hey Balwanth Movie : హే భగవాన్... బలవంతంగా టైటిల్ మార్చాల్సి వచ్చింది
Hey Bhagawan Movie : 'హే భగవాన్' మూవీ టైటిల్‌ను బలవంతంగా మార్చాల్సి వచ్చిందని డైరెక్టర్ గోపి అచ్చర తెలిపారు. అయితే, టైటిల్ మాత్రమే మారిందని... ఎంటర్టైన్మెంట్ అలాగే ఉందన్నారు.

Reason Behind Hey Bhagawan Title Changed As Hey Balwanth : యంగ్ హీరో సుహాస్ నటించిన 'హే భగవాన్' మూవీ టైటిల్‌ను రిలీజ్‌కు 4 రోజుల ముందు 'హే బల్వంత్'గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ గోపి అచ్చర దీనిపై రియాక్ట్ అయ్యారు.
'బలవంతంగా మార్చాల్సి వచ్చింది'
'హే భగవాన్' పేరును 'హే బల్వంత్'గా బలవంతంగా మార్చాల్సి వచ్చిందని డైరెక్టర్ గోపి తెలిపారు. 'హే భగవాన్ కాస్త హే బల్వంత్‌గా మారింది. అయితే, టైటిల్ మాత్రమే మారింది. ఎంటర్టైన్మెంట్ అలానే ఉంది. ఆ ప్రామిస్ నేను మీకు ఇస్తున్నా. ఫన్, ఎమోషన్ కలిపి 'హే బల్వంత్' ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుంది.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : హీరో సుహాస్‌కు ఘోర అవమానం - ఆ హీరోయిన్ పక్కన అతను ఎందుకు అన్నారు?... కట్ చేస్తే...
నెక్స్ట్ మూవీకి చెక్
'హే బల్వంత్' మూవీ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. మూవీ సక్సెస్‌పై తమకున్న కాన్ఫిడెన్స్ చెప్పేందుకు డైరెక్టర్‌కు స్టేజ్‌పైనే నెక్స్ట్ మూవీ కోసం చెక్ ఇచ్చారు. 'ఈ సినిమా ఆడకపోతే మళ్లీ సినిమాలు చేయను అని నేను చెప్పను. ఈ మూవీ ఆడకపోతే మళ్లీ నేను మైక్ పట్టుకొని మాట్లాడను అని నేను అనను. నేను ఒకటి చేసి చూపిస్తా.' అంటూ డైరెక్టర్ గోపికిి నిర్మాత నెక్స్ట్ మూవీ కోసం చెక్ ఇచ్చారు.
'హే బల్వంత్' సినిమా రిలీజ్ అవ్వక ముందే నెక్స్ట్ మూవీ చెక్ ఇచ్చేస్తున్నామని... హిట్ కొట్టబోతున్నామని రెండో మూవీ కూడా చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మా కాన్ఫిడెన్స్ అంటూ తెలిపారు.
రిలీజ్‌కు 4 రోజుల ముందే...
మూవీ రిలీజ్‌కు 4 రోజుల ముందు పేరు మార్చడంపై అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. సోషల్ మీడియాలోనూ పలు ప్రశ్నలు తలెత్తాయి. రీసెంట్‌గా వచ్చిన 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీకి కూడా 'ఫ్రెండ్లీ కపుల్' అంటూ టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు సూచించగా మూవీ టీం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆ మూవీకి 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఇటీవల వచ్చిన 'వానర' మూవీ కూడా 'వనవీర'గా మారింది. సెన్సార్ బోర్జు సూచనతో 'హే భగవాన్' కాస్త 'హే బల్వంత్'గా మారింది.
ఈ మూవీకి గోపి అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్ సరసన శివానీ నాగారం హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, హర్షవర్దన్, యాంకర్ స్రవంతి, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్రరెడ్డి మూవీని నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని కలలు కనే యువకుడు తన తండ్రి బిజినెస్ టేకోవర్ చేయాలనే టైంలో ఎదురైన పరిణామాలేంటి? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కింది.
























