అన్వేషించండి

Kotha Lokah Chapter 2 : 300 కోట్ల బ్లాక్ బస్టర్ 'కొత్త లోక చాప్టర్ 1' - సీక్వెల్‌పై అప్డేట్ వచ్చేసింది

Kotha Lokah Chapter 1 Sequel : గతేడాది 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మలయాళ బ్లాక్ బస్టర్ 'కొత్త లోక చాప్టర్ 1' సీక్వెల్‌పై డైరెక్టర్ డొమినిక్ అరుణ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

Director Dominic Arun Key Update On Kotha Lokah Chapter 2 : గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'కొత్త లోక చాప్టర్ 1'. మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ ఫాంటసీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. 

సీక్వెల్‌పై క్లారిటీ

ఈ మూవీకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా... కల్యాణి  ప్రియదర్శన్‌తో పాటు 'ప్రేమలు' ఫేం నస్లెన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే, దుల్కర్ సల్మాన్, టొవినో థామస్, షాబిన్ సౌహిర్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే సీక్వెల్ చాప్టర్ 2పై క్లారిటీ ఇవ్వగా... తాజాగా డైరెక్టర్ డొమినిక్ కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం 'కొత్త లోక చాప్టర్ 2' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా... మూవీ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఈ మూవీని దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ 'వేఫెరర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఫస్ట్ పార్ట్‌లో దుల్కర్, టొవినో థామస్ అతిథి పాత్రల్లో మెరవగా సీక్వెల్‌లో పూర్తి స్థాయిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేయగా సీక్వెల్‌లో వీటికి ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ మూవీ సీక్వెల్ అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

Also Read : 'రామాయణ'లో కోలీవుడ్ స్టార్? - గ్రేట్ మైథలాజికల్ స్టోరీలో ఆ రోల్‌కు ఓకే చెప్తారా?

ఓటీటీలో స్ట్రీమింగ్

ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో 'కొత్త లోక చాప్టర్ 1' స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుంది? అనేదే ప్రధానాంశంగా మూవీని తెరకెక్కించారు. స్టోరీ విషయానికొస్తే... చంద్ర (కల్యాణి ప్రియదర్శన్)కు సూపర్ పవర్స్ ఉన్న విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు. వాటితో ఆమె అన్నీ మంచి పనులు చేస్తుంటుంది. కొందరి ఆదేశాల మేరకు బెంగుళూరు వచ్చిన ఆమె రాత్రిపూట ఓ సాధారణ అమ్మాయిగా రెస్టారెంట్లో పని చేస్తుంటుంది. తనకు పవర్స్ ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది.

ఇదే టైంలో చంద్ర ఇంటి ఎదురు అపార్ట్‌మెంట్లో ఉండే సన్నీ (నస్లెన్) తొలి చూపులోనే ఆమెను చూసి ఇష్టపడతాడు. ఆమె సాధారణ మనిషి కాదన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు చంద్ర ఎవరు? ఆమెకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? వందల ఏళ్లుగా ఆమె యవ్వనంగా ఎలా ఉంది? తన పవర్స్ మంచి కోసం వాడినా వచ్చిన ఇబ్బందులేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tharun Bhascker: 'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Embed widget