Director Buchibabu Comment To Ram Charan Post : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబో స్పోర్ట్స్ డ్రామా పెద్ది కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, బుచ్చిబాబు రామ్ చరణ్‌ పోస్ట్‌పై చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. 

Continues below advertisement

రీసెంట్‌గా ఫేమస్ మ్యాగజైన్ 'ఎస్కైర్ ఇండియా' కవర్ పేజీపై రామ్ చరణ్ ఫోటో వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చరణ్ స్టైలిష్ లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. న్యూ లుక్స్‌కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతూ విపరీతంగా షేర్ చేస్తున్నారు. సదరు మ్యాగజైన్‌కు ఇంటర్వ్వూ ఇచ్చిన వీడియోను చరణ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా... డైరెక్టర్ బుచ్చిబాబు కామెంట్ వైరల్ అవుతోంది.

చరణ్ సార్‌కు రిక్వెస్ట్

Continues below advertisement

'చరణ్ సార్... మరో ఛాన్స్ ఇవ్వండి' అంటూ కామెంట్ చేశారు బుచ్చిబాబు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... 'పెద్ది' తర్వాత ఇద్దరి కాంబోలో మరో మూవీ రాబోతోందా? అంటూ ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి పెద్ది రిలీజ్‌పైనే ఉండగా... రాబోయే మూవీ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తీయాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'పెద్ది' ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని... చరణ్ కచ్చితంగా బుచ్చిబాబుతో మరో మూవీ చేస్తారంటూ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

Also Read : ఓటీటీలోకి వచ్చేసిన మిస్టీరియస్ థ్రిల్లర్ - అడవిలో కాకి ఆకారంలో ఆలయ రహస్యం... తెలుగులోనూ స్ట్రీమింగ్

'పెద్ది' రిలీజ్ ఎప్పుడు?

మరోవైపు, పెద్ది రిలీజ్ ఈ నెల 30న ఉంటుందని టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా... ఫిలింనగర్ వర్గాల్లో మాత్రం వాయిదా పడుతుందనే ప్రచారమే సాగుతుంది. రీసెంట్‌గా రాకాస టీంతో పెద్ది చెప్పిన టైంకే వస్తుందని స్వయంగా చరణే చెప్పినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలకు ఈ కాస్త టైం సరిపోదని చాలా మంది భావన. అందుకే పెద్ది వాయిదా పడడం కన్ఫర్మ్ అని అప్పుడే రెండు కొత్త తేదీలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. జూన్ ఫస్ట్ వీక్ అంటే 4న కానీ లాస్ట్ వీక్ 24న కానీ రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నట్లు సమచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర ఫేం దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.