Atlee Opens Up About Deepika Padukone Role In Allu Arjun AA22 Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతుండగా... తాజాగా ఓ మీడియా సంస్థకు డైరెక్టర్ అట్లీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

దీపికా నా లక్కీ ఛార్మ్

దీపికా పదుకోన్ తన లక్కీ ఛార్మ్ అని అన్నారు అట్లీ. 'ఈ మూవీలో దీపికా చాలా కొత్తగా కనిపిస్తారు. ఆమె నటన కట్టి పడేస్తుంది. దీపికాతో ఇది నా రెండో సినిమా. ఆమెతో వర్క్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. తల్లైన తర్వాత ఆమె చేస్తున్న ఫస్ట్ మూవీ. ఈ మూవీలో సరికొత్త దీపికాను చూస్తారు.' అంటూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. 

ప్రభాస్ 'కల్కి 2898 AD' తర్వాత పాన్ ఇండియా స్థాయిలో దీపికా నటిస్తోన్న రెండో మూవీ ఇది. అంతకు ముందు అట్లీ దర్శకత్వంలో షారుఖ్, దీపికా ప్రధాన పాత్రల్లో నటించిన 'జవాన్' మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్

అల్లు అర్జున్ మూవీతో ఫ్యాన్స్‌కు బిగ్ సర్పైజ్ సిద్ధం చేస్తున్నామని అట్లీ అన్నారు. 'ప్రతీ రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. మంచి అవుట్ పుట్ ఇవ్వడం కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాం. ప్రతీ ఒక్కరి కోసం భారీ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాం. ఫ్యాన్స్‌తో పాటు మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. మా టీం మొత్తం ఎంతో శ్రమిస్తోంది. ఇది పూర్తయ్యాక అందరూ మూవీని చాలా ఎంజాయ్ చేస్తారు.' అంటూ చెప్పారు.

బన్నీ రోల్‌పై..

పునర్జన్మలు, సమాంతర ప్రపంచం బ్యాక్ డ్రాప్‌గా ఈ మూవీ రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మూడు డిఫరెంట్ రోల్స్‌లో బన్నీ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, విజువల్ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుండగా... సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతాన్ని చూపించనున్నట్లు సమాచారం. సినిమాలో ఎంత మంది హీరోయిన్లు అనే దానిపై క్లారిటీ లేదు.

దీపికా పదుకోన్‌ను అట్లీ కన్ఫర్మ్ చేయగా... మరో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందంటూ లేటెస్ట్ బజ్. మరి ఎవరిని సెలక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. నేషనల్ క్రష్ రష్మిక విలన్ రోల్ చేస్తారనే ప్రచారం సాగింది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, కమెడియన్ యోగిబాబు కూడా కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అప్డేట్స్ రానున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓటీటీ డీల్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది.