Mutton Soup Teaser Released:  యంగ్ హీరో రమణ్, వర్షా విశ్వనాథ్ జంటగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మటన్ సూప్'. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్ ఆకట్టుకుంటుండగా... దసరా సందర్భంగా బుధవారం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు మేకర్స్. కాల్ మనీ, క్రైమ్ ప్రధానాంశంగా తెరకెక్కిన మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Continues below advertisement

ఈ మూవీకి రామకృష్ణ వట్టికూటి దర్శకత్వం వహించగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మించారు. రమణ్, వర్షాతో పాటు జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. రియల్ లైఫ్ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'మటన్ సూప్' అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Continues below advertisement

'బిగ్ సక్సెస్ కావాలి'

'మటన్ సూప్' టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉందని... టీం కూడా చాలా కొత్తగా ఉందని డైరెక్టర్ అనిల్ తెలిపారు. 'దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి.' అని అన్నారు.

డిసిప్లిన్, డెడికేషన్‌కు మారుపేరైన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ రామచంద్ర అన్నారు. 'మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ ఎంతో గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు గారికి థాంక్స్. గొప్పగా నటించిన గోవింద్, జెమినీ సురేష్ గార్లకు థాంక్స్. నాకు అండగా నిలిచిన సునీత అక్కకి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. స్టార్ డైరెక్టర్ అనిల్ మూవీ టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత మల్లిఖార్జున అన్నారు. 

దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి మూవీని నిర్మించారని... టీజర్ బాగుందని అందరూ మెచ్చుకున్నట్లు హీరో రమణ్ అన్నారు. టీజర్ లాంచ్ చేసిన డైరెక్టర్ అనిల్‌కు థాంక్స్ చెప్పారు. అక్టోబర్ 10న రాబోతున్న మూవీని బిగ్ సక్సెస్ చేయాలని కోరారు. 

Also Read: మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, సింగర్ సైంధవి డివోర్స్ - 12 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి

'మటన్ సూప్' నటీనటులు: రమణ్, వర్ష విశ్వనాథ్, జెమినీ సురేష్, గోవింద్ శ్రీనివాస్, కిరణ్ మేడసాని, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ తదితరులు.

టెక్నికల్ టీం: బ్యానర్స్ : అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC), సమర్పణ : రామకృష్ణ వట్టికూటి, దర్శకుడు : రామచంద్ర వట్టికూటి, నిర్మాత : మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల, కెమెరామెన్ : భరద్వాజ్, ఫణింద్ర, మ్యూజిక్ : వెంకీ వీణ, ఎడిటింగ్ : లోకేష్ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పర్వతనేని రాంబాబు, కో డైరెక్టర్ : గోపాల్ మహర్షి.