Director Advani Shared Allu Arjun Comments on Bollywood: కరోనా తర్వాత బాలీవుడ్ పరిస్థితులు అన్ని మారిపోయాయి. వరుస ప్లాప్స్, డిజాస్టర్స్‌తో బాలీవుడ్ బాక్సాఫీసు అల్లాడుతుంది. స్టార్ హీరోల సినిమాలు సైతం ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంలో తడబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ దక్షిణాది సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అంతా బాలీవుడ్ పేరు చెప్పేవారు. అలాంటి ఇండస్ట్రీ ఇప్పుడు హిట్స్ లేక ఢీలా పడిపోతుంది.
దీంతో నార్త్ ఆడియన్స్ దక్షిణాది సినిమాలు సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉత్తరాదినా కూడా సౌత్ సినిమా హావానే కొనసాగుతుంది. తాజాగా ఇదే అంశంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ డ స్పందించారు. ఆయన లేటెస్ట్ మూవీ 'వేదా'ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండిస్ట్రీ అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ గతంలో అల్లు అర్జున్ తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నాతో ఒక మాట అన్నారు. నేను ఆయనతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను.
ఇదే విషయమై నేను ఆయనను కలిశాను. అప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యను లెవనెత్తారు. నేను ఆయనతో సినిమా చేయాలనుకుంటున్న విషయాన్ని చెప్పగానే అల్లు అర్జున్ బాలీవుడ్‌పై నిరాశ వ్యక్తం చేశారు. వెంటనే ఆయన 'బాలీవుడ్‌కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలో మీరేందుకని మర్చిపోయారు?' అని ప్రశ్నించారు. ఆయన మాటలు విని షాక్ అయ్యా. కానీ అల్లు అర్జున్ చెప్పింది నిజమే అనిపించింది" అన్నారు. అనంతరం ఆయన దక్షిణాది సినిమాల గురించి ప్రస్తావించారు. నిజానికి అల్లు అర్జున్ చెప్పినదాంట్లో నిజం ఉందనిపించింది. సౌత్ సినిమాల్లో హీరోయిజం, అందులోని భావోద్వేగాలను చాలా చక్కగా చూపిస్తారు.
ఆ ప్రజెంటేషన్ వల్లే ఆడియన్స్ కూడా కథకు కనెక్ట్ అవుతారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలే వచ్చేవి. అవన్ని కూడా మంచి విజయం సాధించాయి" అని అన్నారు. కాగా నిఖిల్ అడ్వాణీ దర్శకత్వంలో 'కల్ హో నా హో', 'చాందీ చౌక్ టు చైనా', 'దిల్లీ సఫారి, 'హీరో' వంటి చిత్రాలు తెరకెక్కించారు. కరోనా తర్వాత దక్షిణాది సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి సత్తా చాటుతున్నాయి. నార్త్‌లో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పుష్ప, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలకు సౌత్ కంటే బాలీవుడ్‌లోనే అత్యథిక వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశం కూడా తరచూ చర్చనీయాంశం అవుతుంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప ఫస్ట్‌పార్ట్‌కు బాలీవుడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు చేసింది. దీంతో బన్నీ నార్త్ బెల్ట్‌లోనూ మార్కెట్ పెరిగింది.