Dimitrius koloamatangi's Predator Badlands Release Date: సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే అత్యంత డేంజరస్, భయానక పాత్రల్లో ఒకటి 'ప్రెడేటర్'. 1987లో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన యౌట్జా జీవి... 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. ఆ తర్వాత వచ్చిన సిరీస్‌ల్లో... అడవులు, నగరాలు, ఆపై ఇతర గ్రహాల్లోనూ తన వేట సాగిస్తూ ఓ మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్ అందించింది. ప్రస్తుతం తాజాగా మరో సరికొత్త స్టోరీతో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.

స్టోరీలో కీలక మలుపు

ఈ సిరీస్‌లో 'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' అంటూ ఓ కీలక మలుపుతో రూపొందించారు డైరెక్టర్ డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్. గత వాటి కంటే భిన్నంగా స్టోరీలో కీలక మలుపు ఉన్నట్లు తెలుస్తోంది. వేటగాడే వేటలో చిక్కుకుపోయే కథాంశంతో రూపొందుతోంది. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్టోరీ యువ ప్రెడేటర్‌ 'డెక్' చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రమాదకరమైన గ్రహంలో ఆండ్రాయిడ్ యోధురాలు 'థియా'తో కలిసి జీవన యుద్ధం సాగించాల్సి వస్తుంది.యౌట్జా జాతి సంస్కృతి, విలువలు, నైతికత, బలహీనతల్ని లోతుగా చూపించబోతున్న ఈ చిత్రం, ఈ ఫ్రాంచైజ్‌కు ఓ కొత్త మలుపు ఇవ్వనుందనే ఆశలు ఉన్నాయి.

'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' కేవలం యాక్షన్‌, థ్రిల్‌ మాత్రమే కాకుండా, యౌట్జా జీవుల అంతర్ముఖ ప్రపంచాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. వేట అంటే ఏమిటి? వేటగాడి నైతిక సరిహద్దు ఎక్కడిదీ? అనే ప్రశ్నలతో సాగబోయే ఈ చిత్రం, ప్రెడేటర్‌ సిరీస్‌ అభిమానులందరికీ మిస్‌ కాకూడని ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అప్పుడేనా?

1987లో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్

అర్నాల్డ్‌ ష్వార్జె నెగర్‌ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి 'ప్రెడేటర్' చిత్రం అమెజాన్‌ అడవుల్లోకమాండోలుఎదుర్కొన్నకంటికికనిపించనిభయానకమృగంకథతోప్రేక్షకులనుకుదిపేసింది.

1990లో 'ప్రెడేటర్ 2' కాంక్రీట్ జంగిల్

ఈసారి లాస్‌ ఏంజెల్స్‌ నగరాన్ని వేటస్థలంగా మార్చుకున్న యౌట్జా, గ్యాంగ్‌స్టర్లను, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాడు. మానవ చరిత్రలో ఈ జీవుల ఉనికి ఎంతకాలంగా ఉందో ఈ చిత్రంలో చూపించారు.

2010లో 'ప్రెడేటర్స్' గేమ్ ప్రిజర్వ్ అండ్ బియాండ్ప్రెడేటర్స్

ఈ భాగంలో మానవ యోధులను ప్రెడేటర్లస్వగ్రహానికి తీసుకెళ్లి బంధిస్తారు. అక్కడ వారు సూపర్‌ ప్రెడేటర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథ యౌట్జా జాతి అంతర్గత విభేదాలను కూడా చూపించింది. 

2022లో ఎ రిటర్న్ టు రూట్స్ ప్రే

1719లో అమెరికాలోని కమాంచీతెగకు చెందిన యువతి నారు కథతో తెరకెక్కినప్రే”, ప్రెడేటర్‌ సిరీస్‌కు కొత్త ఊపును తెచ్చింది. కొత్త కాలం, కొత్త దృష్టికోణంతోవేటను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు సరికొత్తగా 'ప్రెడేటర్: ది బ్యాడ్ ల్యాండ్స్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు వాటి కంటే గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయమంటూ మూవీ లవర్స్ అంటున్నారు.