ఈ సినిమాలో రామునిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించారు. వారి నటన అద్భుతమని దిల్ రాజు ప్రశంసించారు.
Ramayanam Review: 'రామాయణ'కు దిల్ రాజు రివ్యూ... సినిమా చూశాక ఆయన ఏమన్నారంటే?
Ramayanam Review Telugu: 'రామాయణం' సినిమాను తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు రిలీజ్ చేస్తున్నారు. స్పెషల్ షో చూసిన ఆయన... సినిమాకు ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?

- “దిల్” రాజు 'రామాయణం' సినిమాను విడుదల ముందు వీక్షించారు.
- సినిమాను అద్భుతమైన వెండితెర దృశ్యకావ్యంగా ఆయన అభివర్ణించారు.
- రణబీర్, సాయి పల్లవి, యశ్ నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
- కనువిందు చేసే విజువల్స్, సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయన్నారు.
సీతారాములుగా సాయి పల్లవి (Sai Pallavi), రణబీర్ కపూర్... రావణుడిగా యష్ (Yash) నటించిన సినిమా 'రామాయణం' (Ramayanam Movie). ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (నవంబర్ 5వ తేదీన) విడుదల అవుతోంది. తెలుగులో ఈ సినిమాను అగ్ర నిర్మాత 'దిల్' రాజు విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల కంటే ముందుగా ఆయన ఈ సినిమా చూశారు. స్పెషల్ షో తర్వాత 'రామాయణం' సినిమాకు ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
వెండితెర దృశ్యకావ్యం... 'రామాయణం'
నితీష్ తివారి దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్ ట్రీట్ అని 'దిల్' రాజు చెప్పారు. ఈ చిత్రాన్ని అద్భుతమైన దృశ్యకావ్యంగా ఆయన పేర్కొన్నారు.
''రామాయణం' సినిమాలో రామునిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి తమ పాత్రల్లో జీవించారు. అద్భుతమైన నటన కనబరిచారు. రావణాసురుడి పాత్రలో రాకింగ్ స్టార్ యష్ నటన సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళింది'' అని ప్రధాన పాత్రధారుల నటనపై 'దిల్' రాజు ప్రశంసలు కురిపించారు.
View this post on Instagram
''కనువిందు చేసే విజువల్స్, ఆస్కార్ విన్నర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం, ఆకట్టుకునే కథనం కలిసి ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాయి'' అని 'దిల్' రాజు చెప్పారు. భారీ ఎత్తున సినిమాను తీసిన దర్శక నిర్మాతలు నితీష్ తివారి, నమిత్ మల్హోత్రాలకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు.
View this post on Instagram
Frequently Asked Questions
'రామాయణం' సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?
'దిల్' రాజు 'రామాయణం' సినిమా గురించి ఏమని చెప్పారు?
ఈ సినిమా అద్భుతమైన దృశ్యకావ్యమని, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అని దిల్ రాజు చెప్పారు. కనువిందు చేసే విజువల్స్, ఆస్కార్ విజేతల సంగీతం మంచి సినిమాటిక్ అనుభూతిని ఇస్తాయన్నారు.
'రామాయణం' సినిమాకు సంగీతం ఎవరు అందించారు?
ఆస్కార్ విన్నర్స్ ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. వారి సంగీతం సినిమాకు మరింత అందాన్నిచ్చిందని దిల్ రాజు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















