Dies Irae Telugu Release: స్రవంతి మూవీస్ చేతికి ప్రణవ్ మోహన్ లాల్ సినిమా... తెలుగులోనూ 'డియాస్ ఇరాయ్' రిలీజ్... ట్విస్ట్ ఏమిటంటే?
Dies Irae Release Date: మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ హీరోగా నటించిన మిస్టరీ హారర్ థ్రిల్లర్ 'డియాస్ ఇరాయ్' తెలుగులోనూ రిలీజ్ కానుంది. శ్రీ స్రవంతి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ (Mohanlal) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయనకు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు సినిమాల్లోనూ ఆయన నటించారు. మరి, ఆయన తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ (Pranav Mohanlal)? కొంత మందికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే... భాషలకు అతీతంగా 'హృదయం' విజయం సాధించింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డియాస్ ఇరాయ్' తెలుగులోనూ విడుదల కానుంది.
తెలుగులో విడుదల చేస్తున్న శ్రీ స్రవంతి మూవీస్
'హృదయం' భారీ విజయం సాధించిన తర్వాత ప్రణవ్ మోహన్ లాల్ వరుస పెట్టి సినిమాలు చేయలేదు. తనకు వచ్చిన అవకాశాలు అన్నిటినీ ఓకే చేయలేదు. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ... అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఓ మిస్టరీ హారర్ థ్రిల్లర్ చేశారు. అదే 'డియాస్ ఇరాయ్'. ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్ 'పుష్పక విమానం', 'నాయకుడు' నుంచి ఆ మధ్య ధనుష్ 'రఘువరన్ బీటెక్' వరకు... పలు సూపర్ హిట్ సినిమాలను తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేసింది. ఆ సంస్థ నుంచి డబ్బింగ్ సినిమా వస్తుంది అంటే తప్పకుండా సంథింగ్ స్పెషల్ కంటెంట్ ఉంటుందని ప్రేక్షకుల్లో మంచి నమ్మకం ఏర్పడింది. అందువల్ల 'డియాస్ ఇరాయ్'పై అంచనాలు ఏర్పడ్డాయి.
Dies Irae Telugu Release Date: 'డియాస్ ఇరాయ్' సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. 'భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు ఆయనే దర్శకుడు. ఇప్పుడీ 'డియాస్ ఇరాయ్'ను తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందు రోజు (అక్టోబర్ 30న) కేరళ సహా కొన్ని ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్ షోలు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా మలయాళ వెర్షన్ అదే తేదీన విడుదల కానుంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం నవంబర్ తొలి వారంలో విడుదల చేయనున్నట్లు శ్రీ స్రవంతి మూవీస్ తెలిపింది.
Also Read: ఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల
View this post on Instagram
ప్రణవ్ మోహన్ లాల్ కథానాయకుడిగా రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించిన 'డియాస్ ఇరాయ్'ను నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: 'కాంతార'లో ఆ రోల్ మేకప్‌కు 6 గంటలు... మాయావి కాదు... రిషబ్ శెట్టే - మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ!
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ‘ హృదయం’ (2022) సినిమాతో ఒక సెన్సేషన్ సృష్టించాడు. అయినా కూడా అతను సెలెక్టివ్ గానే సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ప్రణవ్ చేసిన #DiesIrae అనే మిస్టరీ హారర్ర్ థ్రిల్లర్ ఈ నెల 31 న విడుదల కానుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.… pic.twitter.com/oVmvPq5QaG
— Pulagam Chinnarayana (@PulagamOfficial) October 27, 2025





















