రణవీర్ సింగ్ (Ranveer Singh) కథానాయకుడిగా ఆదిత్య ధర్ (Aditya Dhar) దర్శకత్వం వహించిన 'ధురంధర్' (Dhurandhar) రికార్డ్ కలెక్షన్స్ సాధిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసింది. ఆ సినిమా చివర్లో సీక్వెల్ 'ధురంధర్ ది రివేంజ్' (Dhurandhar The Revenge) అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పారు. ఇప్పుడు 'ధురంధర్ 2' విడుదలకు సమయం దగ్గర పడింది. ఇటీవల ఆ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సినిమా సంగతి పక్కన పెడితే... ట్రైలర్ కూడా రికార్డులు క్రియేట్ చేసింది.
రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ట్రైలర్...రెండు రోజుల్లో 312 మిలియన్ల వ్యూస్Dhurandhar 2 Trailer: 'ధురంధర్ 2' ట్రైలర్ మార్చి 7న విడుదల అయ్యింది. ఆ వెంటనే ట్రెండింగ్ లిస్టులోకి వచ్చింది. విడుదలైన కేవలం 48 గంటల్లో ఆ ట్రైలర్ 312 మిలియన్ల వ్యూస్ కంటే ఎక్కువ సాధించింది. సుమారు 45కు పైగా దేశాలలో యూట్యూబ్ చార్ట్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై ఉన్న క్రేజ్ ఆ వ్యూస్ ద్వారా అర్థం అవుతోంది.
'ధురంధర్ 2'లో రణవీర్ సింగ్ డ్యూయల్ షేడ్ ఉన్న రోల్ చేస్తున్నారు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి... రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారు. ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: Polena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?
జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించడంతో పాటు జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ తో కలిసి నిర్మించారు.
Also Read: Shiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?
