Dhurandhar 2 OTT : ఓటీటీలోకి ధురంధర్ 2 - ఇండియాలో ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 OTT Platform : భారత్‌లో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే విదేశాల్లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా... ఇండియాలో అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Ranveer Singh's Dhurandhar 2 OTT Release Date Locked : ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడింది. ఎట్టకేలకు ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ఫిక్స్ చేశారు. శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా అది విదేశాల్లో మాత్రమే.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా... జూన్ 4న రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. మిగిలిన దేశాల్లో ఈ మూవీని నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు. థియేటర్లలో మూవీ రన్ టైం 3 గంటల 49 నిమిషాలు కాగా... ఓటీటీలో రన్ టైం 3 గంటల 52 నిమిషాలుగా ఉంది. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని సీన్స్ యాడ్ చేశారు.
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... గతేడాది వచ్చిన మూవీకి ఇది సీక్వెల్. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా... సారా అర్జున్, అర్జున్ రాంపాల్, రాంపాల్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన మూవీ రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండు ఫ్రాంచైజీలు కలిపి రూ.3 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి.
View this post on Instagram
Also Read : రాజీవ్ కనకాలను అందుకే నిలదీశాం - స్కూల్ కాంట్రవర్సీపై NTVS రియాక్షన్... అసలేం జరిగింది?
స్టోరీ ఏంటంటే?
జస్కిరాత్ సింగ్ తన పేరును హమ్జా అలీగా మార్చుకుని పాకిస్థాన్ వెళ్తాడు. ఆపరేషన్ ధురంధర్ అనే సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తాడు. అక్కడ ల్యారీ పట్టణంలో బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా)ను చంపేస్తాడు. ఇదే అదనుగా భావించిన మరో గ్యాంగ్ లీడర్ అర్షద్ పప్పు (అశ్విన్ ధర్) ల్యారీకి తనను తాను కింగ్ అని అనౌన్స్ చేస్తాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసిన ఉజెయిర్ బలోచ్ (డానిష్) అతనిపై ఎలా పగ తీర్చుకున్నాడు?
ఉజెయిర్ బలోచ్ ల్యారీ పీఠం ఎక్కకుండా హమ్జా ఏం చేశాడు? ఈ క్రమంలో ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్)కు ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? ఉగ్ర దాడులకు ప్రణాళిక రచించిన మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్)ను హమ్జా ఎలా అడ్డుకున్నాడు? హమ్జా ఇండియన్ గూఢచారి అని తెలిసిన తర్వాత ఇక్బాల్ ఏం చేశాడు? ఉగ్రదాడులను హమ్జా ఎలా అరికట్టాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : 'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్రపాలకుడిగా సూర్య తాండవం... సినిమా ఎలా ఉందంటే?
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు























